హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసు చేధించిన పోలీసులు.. కారణమిదే..?

|
Google Oneindia TeluguNews

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కుట్ర కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసును పోలీసులు ఛేధించారు. నిందితుడు ప్రసాద్‌గౌడ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు ఆయుధాలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యేపై పగతోనే ఇలా చేశాడని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

నిజామాబాద్ జిల్లా మక్లూర్‌ మండలం కల్లెడ సర్పంచ్‌ లావణ్యపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు సస్పెండ్ చేశారు. భార్యను సస్పెండ్ చేశారనే కక్షతో ఎమ్మెల్యే హత్యకు సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్ కుట్ర పన్నారు. ఇటీవల బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లో గల జీవన్‌రెడ్డి నివాసానికి ప్రసాద్‌గౌడ్‌ వెళ్లాడు. నేరుగా జీవన్‌రెడ్డి పడకగదిలోకి వెళ్లారు. తన జేబులో ఉన్న పిస్తోలు తీసి జీవన్‌రెడ్డి నుదుటికి గురిపెట్టారు. తనకు న్యాయం చేయాలని, లేదంటే చంపేస్తానని బెదిరించారు.

Recommended Video

ఆజాదీ సాయంతో మోడీ జమిలి ప్లాన్ *National | Telugu OneIndia
police are revealed mla jeevan reddy murder attempt case

షాక్‌ నుంచి తేరుకున్న జీవన్‌రెడ్డి గట్టిగా అరవడంతో వంటమనిషి గంగాధర్‌ మిగతా సిబ్బంది అక్కడికి వచ్చారు. ప్రసాద్‌గౌడ్‌ను వెనుక నుంచి పట్టుకున్నారు. అతడి జేబులో కత్తి కూడా ఉందని గుర్తించారు. సిబ్బంది, బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జీవన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ప్రసాద్‌గౌడ్‌పై హత్యాయత్నం, అక్రమ చొరబాటు, ఆయుధాల వాడకం, బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో మావోయిస్టు సానుభూతిపరుడిగా ప్రసాద్‌ ఉన్నారని తెలిసింది.

ఎమ్మెల్యే ఇంటికి తెలిసిన వారినే అనుమతిస్తారు. అలా ప్రసాద్ గౌడ్ వచ్చాడని కొంచెం భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. కానీ ఇంతలోపు ప్రసాద్ గౌడ్ రావడం.. గన్ తీయడం చకచకా జరిగిపోయాయి. జీవన్ రెడ్డి అరవడంతో.. సిబ్బంది వచ్చి పట్టుకున్నారు. లేదంటే కాల్పులు జరిపితే పరిస్థితి ఎలా ఉండేదోననే సందేహాలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ జీవన్ రెడ్డికి సేఫ్ అయ్యారని.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి.

English summary
banjara hills police are revealed mla jeevan reddy murder attempt case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X