హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో చోరీ కేసు చేజ్, నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 16 రాష్ట్రాల్లో..

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్‌ రెడ్డి ఇంట్లో చోరీ కేసును పోలీసులు చేధించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆరిఫ్ దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నామని మీడియాకు వివరించారు. గత నెలలో ఉత్తమ్ నివాసంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నెలలోపే ఛేదించారు. అయితే నిందితుడు 16 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావడం ఆందోళన కలిగిస్తోంది.

బస్టాండ్‌లో సైకో బీభత్సం: మొబైల్ చోరీ చేసి, ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేసి...బస్టాండ్‌లో సైకో బీభత్సం: మొబైల్ చోరీ చేసి, ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేసి...

కేసు ఛేదన

కేసు ఛేదన

గత నెలలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఉత్తమ్ రెడ్డి నివాసంలో చోరీ జరిగింది. రూ.2 కోట్ల విలువగల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానిక పోలీసులకు ఉత్తమ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేశారు. ఇన్వెస్టిగేషన్‌లో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆరిఫ్ దొంగతనం చేసినట్టు తేలింది.

కళ్లు గప్పి

కళ్లు గప్పి

ఉత్తమ్ రెడ్డి ఇంట్లో పకడ్బందీ భద్రత ఉంటుంది. అదీ కూడా బంగారు ఆభరణాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 12 మంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. కానీ వారి కళ్లు గప్పి మరీ చోరీ చేశాడు. దీనినిబట్టి అతను ఎంత క్రిమినలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రణాళిక ప్రకారం చోరీ చేశారు. తెల్లవారు ఇంటికి తిరిగొచ్చి చూసేవరకు బంగారు నగలు, నగదు లేకపోవడం చూసి చోరీ జరిగిందని భావించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెలుగులోకి వచ్చిందిలా

వెలుగులోకి వచ్చిందిలా

ఉత్తమ్‌రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చోరీ చేసిన ఆరిఫ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని గుర్తించారు. అతను ముంబై నుంచి ఆపరేషన్స్ చేస్తుంటాడని పేర్కొన్నారు. ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో చోరీ చేసిన నగదును ముంబై చీకటి మార్కెట్‌లో విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. కేసు గురించి ఆరా తీస్తే.. నిందితుడు బెంగళూరులో పట్టుబడ్డాడని పోలీసులు వివరించారు.

దొంగతనం కలకలం

దొంగతనం కలకలం

గత నెలలో బంజారాహిల్స్‌లో జరిగిన భారీ చోరీ కేసు సంచలనం సృష్టించింది. చోరీ చేసింది ఎవరనే కోణంలో పోలీసులు విచారించారు. తీగలాగితే డొంక కదిలి.. చోరీకి పాల్పడింది ఆరిఫ్ అని గుర్తించారు. హై ఫ్రొపైల్ వారు నివసించే బంజారాహిల్స్‌లో చోరీ కేసు అప్పట్లో కలకలం రేపింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నెలరోజుల్లోపు చోరీ చేసింది ఎవరో చేధించారు. నిందితుడు ఆరిఫ్‌ను అరెస్ట్ చేశారు.

English summary
hyderabad police arrest most wanted criminal aarif. he theft at uttam reddy house rs 2 crore value gold. aarif his most wanted criminal in 16 states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X