హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాలెట్ పేపర్ పోస్ట్ ఇష్యూ : ఓటరును అరెస్ట్ చేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్ : స్థానిక సంస్థల్లో ఓటేసి బ్యాలెట్ ను ఫోటో తీసిన ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సదరు ఓటర్ ను గుర్తించి చర్యలు తీసుకున్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఓటరును అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకోనున్నారు.

ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
గత శుక్రవారం రెండోవిడత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు వయోజనులు ఓటేశారు. అయితే పాలమూరు దేవరకద్ర మండలం మీనుగోనుపల్లి పోలింగ్ కేంద్రంలో ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. తాను ఓటేసేముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ ఫోటో తీశాడు. అతను ఫోటో తీస్తున్న పోలింగ్ అధికారులు గుర్తించకపోవడం అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలో ఆ ఫోటోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకెముంది తెగ లైకులు కొట్టి ... షేర్ చేయడంతో అది కాస్తా వైరలైంది. దీంతో అధికారులు స్పందించారు.

police arrested ballot paper post person

బ్యాలెట్ పత్రాల ఆధారంగా గుర్తింపు
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. నివేదిక ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించారు. దీంతో జరిగిన ఘటనపై పోలింగ్ అధికారుల వివరణ కూడా తీసుకున్నారు. బ్యాలెట్ పత్రాల క్రమసంఖ్య ఆధారంగా ఓటరను అధికారలు గుర్తించారు. ఎన్నికల నియామవళి ప్రకారం ఓటరు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని .. విచారిస్తున్నారు.

కఠినచర్యలు

సదరు ఓటరుపై ఎన్నికల నియామావళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఈసీ కోరంది. ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలకు సంబంధించి తేలికగా తీసుకొని .. పోస్ట్ చేయడంపై ఈసీ గుర్రుమీదు ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతల ప్రచారాన్ని నిషేధం విధించింది. ఇక ఏకంగా బ్యాలెట్ పోస్ట్ చేయడాన్ని ఎన్నికల అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. భవిష్యత్తులో మరొకరు ఇలా చేయకుండాా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

English summary
Officials took action on the incident that took place in local bodies voter ballot. Recognizing the voter and taking action. The police arrested the voter on the complaint of the officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X