హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి మల్లారెడ్డిపై కేసు: ఎక్కడ, ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ కబ్జాకుకు సంబంధించి కేసు ఫైల్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని దుండిగల్ పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. అయితే మంత్రిపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

కుత్బుల్లాపూర్ మండలం సురారంలో భూమి కబ్జా చేయించారని శ్యామల దేవి అనే మహిళ ఫిర్యాదు చేశారు. తన స్థలంలో మంత్రి అనుచరులు ప్రహరీ గోడ నిర్మించారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు తన లాయర్‌ను కూడా తమ వైపు తిప్పుకున్నారని ఆమె ఆరోపించారు. భూమి కొనుగోలుకు సంబంధించి తప్పుడు అగ్రిమెంట్ సృష్టించారని ఫిర్యాదులో వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

police filed a case by minister malla reddy

కానీ స్థానికంగా కేసు కలకలం నెలకొంది. మంత్రి సదరు మహిళ ఆరోపణలు చేయడం చర్చకు దారితీసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే మంత్రిపై కేసు అనే అంశం దుమారం రేపుతోంది. దీనిపై మంత్రి, ఆయన అనుచరులు గానీ స్పందించలేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్‌లో అనుకున్నన్నీ సీట్లు రాక టీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉంది. ఈ క్రమంలో క్యాబినెట్ మంత్రిపై కేసు నమోదవడం ఆ పార్టీకి కొంచెం ఇబ్బందిగా మారింది. ఇటు మరో మంత్రిపై కూడా రాసలీలల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
police filed a case by telangana labourer minister malla reddy in dundigal police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X