హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవి ప్రకాశ్ ఇంటిముందు పోలీసుల హల్‌చల్...

|
Google Oneindia TeluguNews

విచారణలో భాగంగా కాసేపటి క్రితం హైదరాబాద్‌లోని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అనంతరం రవిప్రకాశ్‌కు సంబంధిన కార్లను సీజ్ చేయడంతో పాటు ఆయన డ్రైవర్ వద్ద ఫోన్‌ను కూడ లాక్కున్నట్టు తెలుస్తోంది. అయితే రవి ప్రకాశ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంట్ లేకుండా ఎలా వస్తారని ఆమే ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

కాగా రవి ప్రకాశ్‌పై ఉన్న ఫోర్జరీ, కేసుల నిమిత్తం ఆయన్ను కాగా జూన్ 4వ తేదీ నుండి 6 తేదీ వరకు రవి ప్రకాశ్‌ను సైబర్‌క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. మూడు రోజుల పాటు పోలీసులు విచారణలో సరైన సమాచారం ఇవ్వలేదని వార్తలు వెలువడ్డాయి. కాగా విచారణకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను పోలీసులు సిద్దం చేసి కోర్టు సైతం సమర్పించారు.

police have reached to the house of TV9 former CEO of Ravi Prakash in Hyderabad

అయితే మూడు రోజుల విచారణలో రవిప్రకాశ్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు అందివ్వలేదని చెబుతున్నారు. ఆయన లోపల ముబావంగా ఉంటూ మిడియాతో మాత్రం మరోలా మాట్లాడారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఇవే అంశాలను కోర్టు దృష్టి తీసుకుపోయారు... కేసు దర్యాప్తులో పలు ప్రశ్నలపై సరైన సమాధానం చెప్పకుండా తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. పలు వివరాలు అడిగినప్పుడు తనకు తెలియదని చెప్పకపోవడంతో గుర్తు లేదని చెప్పారని విచారణ అధికారులు తెలిపారు. దీంతో ఇదే అంశాలతో కోర్టుకు నివేదిక పంపించారు. .

English summary
the police have reached the house of TV9 former CEO of Ravi Prakash in Hyderabad. Theit is suspected to be seizing cars and his driver phone also . Ravi Prakash His wife was angry at the police with out warrent to search home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X