• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇదెక్కడి సరదారా నాయనా.. పోలీసుకే ముద్దు పెట్టాడు..! (వీడియో)

|
  పోలీస్‌కు 'ముద్దు' పెట్టిన మందుబాబు (వీడియో)

  హైదరాబాద్ : ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. పోలీసులు స్నేహపూర్వక వాతావరణంలో పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయనేది గవర్నమెంట్ ఆలోచన. బాధితులు ఠాణా మెట్లెక్కితే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ సహకరించాలే తప్ప నిందితులకు బాసటగా నిలవొద్దనేది కాన్సెప్ట్. ఆ క్రమంలో చాలాసార్లు పోలీస్ బాస్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పలు పోలీస్ స్టేషన్లను తనిఖీలు చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆదేశించారు. అదలావుంటే హైదరాబాద్ బోనాల సందర్భంగా మత్తెక్కిన ఓ చిన్నోడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరోలా అర్థం చేసుకున్నాడు.

  అశ్లీల వీడియోలు చూపిస్తూ.. ఆ రకంగా కావాలంటూ.. శాడిస్టు భర్తపై ఫిర్యాదు..!అశ్లీల వీడియోలు చూపిస్తూ.. ఆ రకంగా కావాలంటూ.. శాడిస్టు భర్తపై ఫిర్యాదు..!

  ఆషాఢ మాసం బోనాల చివరి అంకంలో గ"మ్మత్తు" చోటుచేసుకుంది. ఊరేగింపులో భాగంగా డప్పు వాయిద్యాల చప్పుళ్లకు డ్యాన్సులు చేస్తూ కొందరు యువకులు రోడ్డుపై డ్యాన్సులు చేస్తున్నారు. ఆ క్రమంలో విధి నిర్వహణలో భాగంగా అటువైపు నడుచుకుంటూ వెళుతున్న ఇన్‌స్పెక్టర్ స్థాయి పోలీసును ఓ యువకుడు దగ్గరగా వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని సదరు పోలీస్ ఆఫీసర్ తేరుకునే లోపే ముద్దు కూడా పెట్టేశాడు. ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడో అంతే బందోబస్తుగా ముద్దు కూడా ఇచ్చాడు.

  police kissed by hyderabad guy in bonalu celebrations

  బోనాల సందర్భంగా మందేసి చిందు వేయడం కామన్. ఆ క్రమంలో మత్తులో ఉన్న సదరు యువకుడు పోలీస్ ఆఫీసర్‌కు ముద్దు పెట్టాడు. అసలు ఆ యువకుడి ఉద్దేశం పోలీస్ ఆఫీసర్ తమతో కలిసి ఓ స్టెప్పు వేస్తారని ఆశించి అలా చేశాడేమో. అయితే సదరు పోలీసాయన తేరుకుని లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. అయినా కూడా ఆ యువకుడు బెదరలేదు. పోలీస్ ఆఫీసర్‌ను తప్పించుకుంటూ నెమ్మదిగా స్టెప్పులేసుకుంటూ అలా అలా వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  ఆ వీడియోలో సదరు యువకుడి తీరు క్యాజువల్‌గా కనిపిస్తోంది. ఏదో ఎంజాయ్ చేద్దాం అన్నట్లుగా ఉన్న ఆ యువకుడి తీరు నవ్వు తెప్పిస్తోంది. అంతేకాదు ఆ సన్నివేశం కూడా డప్పు చప్పుళ్లకు అనుగుణంగా కనిపించడం మరింత నవ్వులు పూయిస్తోంది. అయితే అది అలా సరదాగా కనిపిస్తున్నా.. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల అలా ప్రవర్తించడం తప్పు కాదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

  English summary
  A Funny Incident took place in Hyderabad Bonalu. One of drunken youngster kissed police officer while he was in duty. This video goes viral in social media. The police officer slapped that guy and then moved to his duty.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X