• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పెరుగుతున్న శిల్పాచౌదరి బాధితుల లిస్ట్.. పోలీస్ అధికారి కోడలు, ఓ జస్టిస్ చెల్లె, హీరో ఫ్యామిలీ బాధితులే...

|
Google Oneindia TeluguNews

కిట్టీ పార్టీలు, పేకాట ఆడించి.. కోట్లు కొల్లగొట్టింది శిల్పాచౌదరి. ఆమె బాధితుల్లో ప్రముఖులు కూడా ఉన్నారు. పోలీసు అధికారి కోడలు, న్యాయూమర్తి చెల్లె, ఓ హీరో ఫ్యామిలీ కూడా కోట్లు సమర్పించుకున్నారు. శిల్పా చౌదరి మోసాల గురించి తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అనేక మంది ప్రముఖుల భార్యలు, కోడళ్లు, చెల్లెళ్లు శిల్పా చౌదరి బాధితులేనని తెలుస్తోంది.

సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. నివాసం ఉంటున్న పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్నట్లయితే స్థానిక స్టేషన్లలో లేదా మాదాపూర్‌ డీసీపీని కలిసి వివరాలు వెల్లడించొచ్చని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

రూ.12 కోట్లు వసూల్

రూ.12 కోట్లు వసూల్

శిల్పాచౌదరి బాధితుల్లో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. టాలీవుడ్‌ ప్రముఖ హీరో ఫ్యామిలీ రూ.12 కోట్లు మోసపోయినట్లు సమాచారం. ఇద్దరూ టాలీవుడ్‌ హీరోకు అత్యంత ఆప్తులుగా తెలిసింది. సినిమా ఇండస్ట్రీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి కోసం ఒక్కొక్కరి వద్ద రూ.6 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మరో సీనియర్‌ నటుడు రూ.2.4 కోట్లు మోసపోయినట్లు తెలిసింది. బాధితులు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట తదితర పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు ఇచ్చినట్లు సమాచారం.

రూ.6 కోట్లు

రూ.6 కోట్లు

ఓ పోలీస్‌ ఉన్నతాధికారి కోడలు రూ.6 కోట్లు, కీలక స్థానంలో ఉన్న న్యాయమూర్తి కుటుంబ సభ్యులు రూ.5 కోట్లు వ్యాపారంలో పెట్టుబడి కోసం శిల్పాచౌదరికి ఇచ్చినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట నవీన్‌నగర్‌కు చెందిన సుమంత్‌.. శిల్పా చౌదరికి ఈ ఏడాది సెప్టెంబరులో రూ.15 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. నెలలో తిరిగి ఇచ్చేస్తానని నమ్మించడంతో డబ్బులు ఇచ్చారు. ఆమె మోసాల గురించి పేపర్‌లో చదివిన సుమంత్‌ పోలీసులను ఆరశయించారు. శిల్పా చౌదరి దంపతులను పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

శిల్పాచౌదరి తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించినట్లు తెలిసింది. శిల్పాచౌదరి ఎలాంటి మోసాలూ చేయలేదని, పోలీసులు కావాలనే ఇదంతా చేస్తున్నారని వాదించినట్లు సమాచారం. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం శిల్పా చౌదరి చంచల్‌గూడ జైల్లో, ఆమె భర్త చర్లపల్లి జైల్లో ఉన్నారు.

  Viral: Police Complaint For Pencil బుడ్డోడి పోలీస్ కంప్లైంట్... రాయలసీమ బ్లడ్ మరి || Oneindia Telugu
  ఇలా అట్రాక్ట్ చేసి..

  ఇలా అట్రాక్ట్ చేసి..

  సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలను ఆకట్టుకున్న శిల్పా చౌదరి వారిని సిగ్నేచర్‌ విల్లాకు పిలిపించి కిట్టీపార్టీలతో పాటు పేకాట దందా నిర్వహించినట్లుగా తెలిసింది. ఆ సమయంలో రూ.లక్షల ఖరీదైన మద్యాన్ని సరఫరా చేసేదని సమాచారం. పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.

  శిల్పా చౌదరి భర్త కృష్ణశ్రీనివాస ప్రసాద్‌ అలెక్సా అనే ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో రీజినల్‌ డైరెక్టర్‌గా పనిచేసేవాడని పోలీసులు గుర్తించారు. భార్య చేస్తున్న మోసాల్లో పాలుపంచుకున్న శ్రీనివాస ప్రసాద్‌ ఆ డబ్బుతో ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కానీ కిట్టీ పార్టీలు, పేకాట ఆడి.. ప్రముఖులు రూ.కోట్లను సమర్పించుకున్నారు. శిల్పా చౌదరీ మోసాలను పోలీసులు క్రమ క్రమంగా చేధిస్తున్నారు.

  English summary
  police officer daughter in law, justice sister, hero family are shilpa chaudhary victims. they are give to shilpa crore rupees.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X