• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రిమాండ్ రిపోర్ట్ : ప్రొఫెసర్ కాశింపై పోలీసుల సంచలన స్టేట్‌మెంట్స్..

|

ఇటీవల అరెస్టయిన ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశింపై పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సిద్దం చేశారు. రిపోర్టును గురువారం హైకోర్టుకు సమర్పించనున్నారు. ఇందులో కాశింపై పోలీసులు సంచలన స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. మావోయిస్టులతో కాశింకు సంబంధాలు ఉన్నట్టు ధ్రువీకరించిన పోలీసులు, మావోయిస్టు రిక్రూట్‌మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. కాశింతో పాటు ఇప్పటివరకు మొత్తం 60మందిపై ఊపా చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

కాశింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని..

కాశింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని..

ప్రస్తుతం కాశిం,ఆయన భార్య స్నేహలత నడుస్తున్న తెలంగాణ అనే సంచికను నడుపుతున్నారు. ఇందుకోసం మావోయిస్టులే నిధులు పంపిస్తున్నారని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. మావోయిస్టులకు కాశింఎన్‌క్రిప్టెడ్ విధానంలో ఈమెయిల్స్ ద్వారా సమాచారాన్ని చేరవేసినట్టు తెలిపారు. కాశింకు సెంట్రల్ బ్యూరో రీజియన్ కార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్,కేంద్ర కమిటీ సభ్యులు కట్కం సుదర్శన్,పుల్లూరి ప్రసాదరావు, రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌తో సంబంధాలు ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాదు,విచారణలో మావోయిస్టు నేతలతో సంబంధాలను కాశిం ఒప్పుకున్నట్టు తెలిపారు.

మావోయిస్టు రిక్రూట్‌మెంట్లు..

మావోయిస్టు రిక్రూట్‌మెంట్లు..

తెలంగాణ విద్యార్థి వేదిక,తెలంగాణ విద్యార్థి సంఘం,చైతన్య మహిళా సమాఖ్య వంటి 19 సంఘాలతో మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కాశిం సమన్వయకర్తగా పనిచేస్తున్నారని చెప్పారు. మావోయిస్టు నియామకాల్లో కాశిం కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. మావోలకు అవసరమైన కంప్యూటర్లు,ఆయుధాలు సమకూర్చడంలో కాశిం దిట్ట అని చెప్పారు. తన చర్యలను కప్పి పుచ్చుకునేందుకు కాశిం ప్రొఫెసర్ వృత్తిలో కొనసాగుతున్నట్టు తెలిపారు. కాశిం ఇంట్లో 118 డాక్యుమెంట్లు, 163 సీడీలు, 5 డిజిటల్ వీడియో క్యాసెట్లు,44 జీబీ సామర్థ్యం గల 4 పెన్ డ్రైవ్స్,8జీబీ మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.ల్యాండ్ మైన్ మెటీరియల్ సప్లై. పూర్తి ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేశామని వెల్లడి. మొత్తం 60 మంది ఊపా చట్టం. మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులతో పాటు,సెంట్రల్ కమిటీ,ప్రజా సంఘాల నేతలు. ప్రజా తెలంగాణ ఫ్రంట్,డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నేతలు కూడా. అర్బన్ నక్సల్ కేసులు. చైతన్య మహిళా సమాఖ్య. చర్ల పోలీస్ స్టేషన్‌లో 45మందికి పైగా మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యుు

 కాశింతో పాటు కేసులు నమోదైనవారు..

కాశింతో పాటు కేసులు నమోదైనవారు..

ఊపా చట్టం కింద నమోదైన కేసుల్లో మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులతో పాటు,సెంట్రల్ కమిటీ సభ్యులు, తెలంగాణ ప్రజా ఫ్రంట్,డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ సహా పలు ప్రజా సంఘాల నేతలు ఉన్నట్టు తెలిపారు. ఇందులో ఎల్బీనగర్‌లో నమోదైన కేసులో 8గా కాశిం ఉన్నట్టు పేర్కొన్నారు. కేసులు నమోదైనవారిలో సెంట్రల్ కమిటీ సభ్యులు,జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యడు వేణుగోపాల్,మావోయిస్ట్ తెలంగాణ సెక్రటరీ హరిభూషణ్‌ ఉన్నట్టు వెల్లడించారు.

ఖండించిన పౌరహక్కుల కార్యకర్త లక్ష్మణ్

ఖండించిన పౌరహక్కుల కార్యకర్త లక్ష్మణ్

పౌరహక్కుల కార్యకర్త,ప్రొఫెసర్ లక్ష్మణ్ కాశిం అరెస్టును,ఆయనపై ఆరోపణలను ఖండించారు. సిద్దాంతాలతో ఏకీభవించనివారిపై అర్బన్ నక్సల్‌గా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ కాశిం ఉస్మానియా వర్సిటీలో తెలుగు డిపార్ట్‌మెంటులో ఉద్యోగం చేసుకునే వ్యక్తి అన్నారు. ఖాళీ సమయాల్లో దోపిడీ,దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై సామాజిక బాధ్యతతో గొంతు విప్పుతున్నామని చెప్పారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు పరిరక్షంచబడాలని, ఆత్మగౌరవంతో మంచి జీవనం కొనసాగించాలని పనిచేస్తున్నట్టు తెలిపారు. కాశిం ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్టుగా చెబుతున్న హార్డ్ డిస్కులను పోలీసులే అక్కడ పెట్టి ఉంటారని ఆరోపించారు. మనుషుల గొంతులు నొక్కడం సబబు కాదని.. ఆ గొంతులు ఏం మాట్లాడుతున్నాయో వినాలని సూచించారు.

English summary
Telangana Police prepared remand report of Osmania University Professor Kasim,tomorrow they will submit it in Highcourt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X