హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ వార్ .. కొనసాగుతున్న పోలింగ్ .. పాతబస్తీలో హై అలెర్ట్ ... రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారాన్ని జరిపి ఈరోజు గ్రేటర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వివాదాస్పద ప్రచారాలు అనంతరం, పాలు ఉద్రిక్తతల అనంతరం చోటుచేసుకుంటున్న ఈ పోలింగ్ సజావుగా సాగాలని పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీ పై ప్రత్యేకమైన నజర్ పెట్టింది పోలీసు యంత్రాంగం.

590 సమస్యాత్మక, 387 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

590 సమస్యాత్మక, 387 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

పాతబస్తీ లో 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. పాతబస్తీకి సంబంధించి 590 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 387 అత్యంత సమస్యాత్మక కేంద్రాలున్నాయి. దీంతో పోలీసులు ఘర్షణలకు ఆస్కారమున్న సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు.70 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గతంలో పురానాపూల్, శాలిబండ ఏరియాలలో ఉద్రిక్తతలు.. అందుకే ఈ సారి జాగ్రత్తగా

గతంలో పురానాపూల్, శాలిబండ ఏరియాలలో ఉద్రిక్తతలు.. అందుకే ఈ సారి జాగ్రత్తగా

స్పెషల్ ట్రాకింగ్ టీం లను, రూట్ మొబైల్ టీంలను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గతంలో పురానాపూల్, శాలిబండ ఏరియాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న కారణంగా, ఈసారి గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ ఎన్నికల్లో గతంలోలా ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా, రీపోలింగ్ అవకాశమే లేకుండా ఉండేందుకు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పాతబస్తీపైనే ప్రధాన పార్టీల దృష్టి ..అందుకే పోలీసుల ప్రత్యేక శ్రద్ధ

పాతబస్తీపైనే ప్రధాన పార్టీల దృష్టి ..అందుకే పోలీసుల ప్రత్యేక శ్రద్ధ

పాతబస్తీలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు సజావుగా ఎన్నికల పోలింగ్ కొనసాగేలా చూస్తే ఈ ఎన్నికల పోలింగ్ సక్సెస్ చేసినట్టే. ఎందుకంటె ఈ సారి ఎన్నికలలో పాతబస్తీ విషయంలో పెద్ద దుమారమే చెలరేగింది. పాతబస్తీ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . పలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికల పోలింగ్ పాతబస్తీలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమే . దీంతో అన్ని పార్టీల దృష్టి పాతబస్తీపై ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ విషయంలో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది .

English summary
Polling is currently underway at 17 police stations in old city. There are 590 sensitive polling stations in the old city and 387 hiper sensitive centers. Police have deployed additional police forces in troubled and highly troubled areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X