హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలింగ్ డే హాలిడే.. ఐటీ కంపెనీలకు ఈసీ ఆదేశం..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. అటు ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ జరిగే గురువారం (11.04.2019) నాడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవుదినంగా ప్రకటించాయి. అయితే కొన్ని ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వకపోవడం చర్చానీయాంశమైంది.

ఏపీ, తెలంగాణకు చెందిన యువత హైదరాబాద్ లోని పలు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే పోలింగ్ తేదీని కొన్ని సంస్థలు సెలవుదినంగా ప్రకటించాయి. అదలావుంటే మరికొన్ని కంపెనీలు ప్రాజెక్ట్స్ పూర్తికాలేదంటూ హాలిడే ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఎవరైనా కాదు కూడదని డుమ్మా కొడితే తగిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాయట. దాంతో చాలామంది స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేయని పరిస్థితి నెలకొంది.

polling day should be holiday election commission orders to it companies

నిజాయితీ లీడర్లు కనబడుట లేదు.. 'నోటా' కు ఓటు..! యువజంట వినూత్న ప్రచారంనిజాయితీ లీడర్లు కనబడుట లేదు.. 'నోటా' కు ఓటు..! యువజంట వినూత్న ప్రచారం

పోలింగ్ నాడు సెలవు లేదంటూ మొండికేసిన ఐటీ కంపెనీల తీరుపై.. ఫోరమ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయిస్ ప్రతినిధులు మండిపడుతున్నారు. హాలిడే ఇవ్వకుండా సతాయిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిశారు. వీరి వినతి మేరకు స్పందించిన ఈసీ అధికారులు.. గురువారం కచ్చితంగా సెలవు ఇవ్వాలని ఐటీ కంపెనీలను ఆదేశించారు. మరోవైపు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

English summary
In the view of lok sabha elections, some it companies doesn't declare as holiday on polling date. Some of it forum association members met with state election commission CEO Rajat Kumar and given a complaint. The ec officials ordered that IT companies should be declared as holiday for elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X