హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి.. పొన్నం, కోమటిరెడ్డి పిలుపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రస్తుత నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వేర్వేరు మీడియా సమావేశాల్లో హుజుర్‌నగర్ బై పోల్స్‌కు సంబంధించి ఆ ఇద్దరు నేతలు పలు అంశాలు ప్రస్తావించారు.

హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ నేతలకు మరింత అహంకారం పెరుగుతుందన్నారు పొన్నం ప్రభాకర్. ఇప్పటికే గాల్లో తేలుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేలకు దించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో హుజుర్‌నగర్ బై పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవడమనేది ప్రజలకు అత్యంత అవసరమని పేర్కొన్నారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ పార్టీ నేతలో ఇప్పటికే గుబులు ప్రారంభమైందన్నారు. ఇక తాడోపేడో తేల్చాల్సింది ప్రజలేనని చెప్పుకొచ్చారు.

హుజుర్‌నగర్ మాదే.. కారుదే విజయం.. ఉత్తమ్‌వి వట్టి మాటలే : మంత్రి సత్యవతి రాథోడ్హుజుర్‌నగర్ మాదే.. కారుదే విజయం.. ఉత్తమ్‌వి వట్టి మాటలే : మంత్రి సత్యవతి రాథోడ్

ponnam prabhakar and komatireddy venkat reddy fires on trs

టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్ కుటుంబానికి లాభం తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు పొన్నం. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ గెలుపు అనివార్యమని అన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం అలాగే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయట పడేసేందుకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరారు.

ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో అడుగు ముందుకేసి టీఆర్ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు హుజుర్‌నగర్ ఉప ఎన్నిక నియంత పాలనకు, తెలంగాణ ఆడపడుచులకు మధ్య జరుగుతున్న యుద్దంగా అభివర్ణించారు. నియోజక వర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి గెలిపించాలని కోరారు. ఈసారి నియంత సీఎం కేసీఆర్‌కు హుజుర్‌నగర్ ప్రజలు తగిన బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.

English summary
Congress Leaders Ponnam Prabhakar and Komatireddy Venkat Reddy Fires On TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X