హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్బంధ ఓటింగే శరణ్యమా?: గ్రేటర్‌లో ఓ చోట పోలింగ్ మరీ 0.74శాతమా? -కరెంట్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్నా?

|
Google Oneindia TeluguNews

'ఏంట్రా ఇది.. హాలిడీ ఇచ్చారని హ్యాపీగా తిని పడుకున్నారా?'.. 'సిటీ మొత్తం కరెంటు ఆపేసి.. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసుల్ని కూడా నిలిపేస్తే తప్ప జనం బయటికొచ్చేలా లేరు..'.. 'ఛీ.. ఈ సిటీలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా.. కదరలామీరు.. '.. 'పాక్ సరిహద్దులోని జమ్మూకాశ్మీరే నయం తక్కువలో తక్కువ 2శాతం ఓట్లయినా పోలవుతాయి.. హైదరాబాద్ లోని తలాబ్ చంచలం(34వ డివిజన్)లో మరీ 0.74 శాతం పోలింగా?'.. ఇవీ.. జీహెచ్ఎంసీ పోలింగ్ తీరుపై కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో వ్యక్తమవుతోన్న అభిప్రాయాల్లో కొన్ని మాటలు..

భారీగా తగ్గిన పోలింగ్..

భారీగా తగ్గిన పోలింగ్..

వలసదారులు ఎక్కువగా నివసించే హైదరాబాద్ మహానగరంలో ఎన్నికలు ఏవైనా పోలింగ్ శాతం 50కి మించి నమోదైన సందర్భాలు చాలా అరుదు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో ఓవరాల్ గా 45.29 శాతం పోలింగ్ నమోదైంది. అదే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీవ్యాప్తంగా 50.86 శాతం, చివరిగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 45.51 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కరోనా భయాలు, వరుస సెలవులు, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర కారణాలతో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ 40 శాతానికి కూడా చేరకపోవడం గమనార్హం. పూర్తి స్థాయి లెక్కలు బుధవారం ఉదయానికి అందుబాటులోకి వస్తాయి. సిటీలో ఓటర్ టర్నౌట్ తక్కువగా ఉండటంతో నిర్బంధ ఓటింగ్ పై చర్చ జోరందుకుంది. నిజానికి..

నిమ్మగడ్డకు జగన్ మరో షాక్ -స్థానిక ఎన్నికలపై హైకోర్టులో సర్కారు పిటిషన్ -సుప్రీం తీర్పుతో ఆటలా?నిమ్మగడ్డకు జగన్ మరో షాక్ -స్థానిక ఎన్నికలపై హైకోర్టులో సర్కారు పిటిషన్ -సుప్రీం తీర్పుతో ఆటలా?

తప్పు పార్టీలదా? ఎస్ఈసీదా

తప్పు పార్టీలదా? ఎస్ఈసీదా

ప్రచారంలో హోరెత్తించిన పార్టీలు.. ప్రజల్ని పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో మాత్రం వెనక్కి తగ్గాయి. ఎందుకంటే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల కమిషన్ కఠినమైన నిబంధనలు పెట్టింది. ఓటర్లను తరలించినట్లు తెలించినా, మరే ఇతర పద్ధతుల్లోనూ ప్రయత్నించినా ఆయా పార్టీలపై తీవ్ర చర్యలు, వాహనాల సీజ్, బాధ్యులకు జైలు శిక్షలు కూడా పడతాయని ఎస్ఈసీ పార్థసారధి హెచ్చరించారు. పారదర్శకమైన ఎన్నికల కోసం ఆయన చెప్పిన మాటలు మిస్ ఫైర్ అయినట్లుగా కనిపిస్తోంది. గతంలో గల్లీ గల్లీ తిరుగుతూ ఇండ్లోని ఓటర్లు బయటికి రావాలని సందడి చేసిన పార్టీల కార్యకర్తలు ఈసారి సైలెంటైపోయారు. కరోనా భయంతో జనం కూడా బయటివాళ్లతో కలవడానికి ఆసక్తిచూపలేదు. 60 ఏళ్లు పైబడిన ఓటర్లు అందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం నూరుశాతం కల్పించే విషయంలో పార్టీలుగానీ, ఎస్ఈసీగానీ చెప్పుకోదగిన తీరులో పనిచేయలేదు. ఈలోపు ఆది, సోమవారాల్లో కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి వెలువడిన హెచ్చరికలు ప్రజల్ని ఇళ్లు కదలనీయకుండా చేశాయి. నిజానికి ప్రతి పోలింగ్ కేంద్రంలో కరోనా నిబంధనల మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ.. అవి జనంలో భరోసా నింపలేకపోయాయి. మరో కోణంలో..

గ్రేటర్ షాకింగ్ :ఈ నగరానికి ఏమైంది? -పోలింగ్ శాతం ఢమాల్ -కారణాలివే -ఖర్చుమాత్రం పెరిగిందిగ్రేటర్ షాకింగ్ :ఈ నగరానికి ఏమైంది? -పోలింగ్ శాతం ఢమాల్ -కారణాలివే -ఖర్చుమాత్రం పెరిగింది

నిర్భంద ఓటింగ్ శరణ్యమా?

నిర్భంద ఓటింగ్ శరణ్యమా?

గ్రేటర్ పోలింగ్ కు సంబంధించి యంత్రాంగం, పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపే ముందు ఓటర్ల నిరాసక్తతను కూడా ప్రశ్నించాల్సిందేనని నెట్టింట చర్చ జరుగుతోంది. కొన్ని వార్డుల్లో కేవలం ఒకటి నుంచి ఐదు శాతం లోపే పోలింగ్ నమోదు కావడం, ఐటీ ప్రొఫెషన్స్ ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పట్టుమని 10 శాతమైనా నమోదుకాకపోవడం ప్రజాస్వామికవాదుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సందర్భంగా నిర్బంధ ఓటింగ్ విధానంపై చర్చ జోరందుకుంది. అర్హత కలిగిన ఓటర్లందరూ పోలింగ్ డే నాడు తప్పనిసరిగా ఓటేసేలా, ఒకవేళ ఓటేయకుంటే వారిపై చర్యలు తీసుకునే విధానం వస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాబోదని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి పోస్టులకు ‘సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు రాయడం తప్ప మీరైనా ఓటేశారా లేదా?'అని దెప్పిపొడుపు కామెంట్లు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసే ఓటర్లు ఓటేసేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారని ఇంకొందరు మండిపడ్డారు.

ఓటు వేయకుంటే హక్కు కోల్పోయేలా..

ఓటు వేయకుంటే హక్కు కోల్పోయేలా..


గ్రేటర్ లో అత్యల్ప పోలింగ్ పై చర్చ సందర్భంగా.. ఓటు వేయడం తప్పనిసరి చేయాలంటూ బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ గతంలో చేసిన సూచన వైరలవుతోంది. దేశంలో నిర్బంధ ఓటింగ్ అమలు చేయాలని, ఓటు వేయనివారికి భవిష్యత్తులోనూ ఓటేసే అవకాశం లేకుండా చేయాలని అద్వానీ పలు మార్లు సూచించారు. తప్పనిసరి ఓటింగ్ విధానం అమలవుతోన్న దేశాల్లో ఎన్నికల నాడు పోలింగ్ బూత్ కు రాని పౌరులపై ఒక్కోరకం శిక్షలున్నాయి. ఆస్ట్రేలియాలో ఓటేయని పౌరులు జ్యూరీకి సంజాయిషీ చెప్పుకోవాలి. అది సంతృప్తికరంగా లేకుంటే జరిమాన కట్టాల్సి ఉంటుంది. బొలీవియాలో ఓటేయకుంటే జీతాలు ఇవ్వరు. పెరూలో ఓటేయని పౌరుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. బెల్జియంలో ఓటింగ్ పట్ల నిరాసక్తంగా ఉండే యువతకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వరు. ఇక అర్జెంటీనాలోనైతే ఓటేయనివాళ్లకు ప్రభుత్వ పథకాల్లో కోత పెడతారు. మరి భారత్ లో..

Recommended Video

GHMC Polls : Hyderabad Voters.. కనిపించుట లేదు | Hyderabad Civic Polls Review
నిర్బంధ ఓటింగ్ సాధ్యమేనా?

నిర్బంధ ఓటింగ్ సాధ్యమేనా?

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో.. స్థానిక ఎన్నికల్లో నిర్బంధ ఓటింగ్ అమలయ్యేలా బిల్లు తెచ్చారు. కానీ ఆ విధానాన్ని అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్ ఖురేషీ తప్పుపట్టారు. అధిక జనాభా ఉన్న ఇండియాలో నిర్బంధ ఓటింగ్ విధానాన్ని అమలు చేయలేమని, ప్రజాస్వామ్యం, నిర్బంధం చెట్టపట్టాలేసుకుని సాగలేవని ఖురేషీ వ్యాఖ్యానించారు. దేశంలో అర్హులందరూ ఇంకా ఓటు హక్కు పొందలేదని, ప్రతిసారి ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు చోటుచేసుకోవడం లాంటివి కఠోరవాస్తవాలు. వ్యవస్థను అంతకంతకూ పటిష్టపర్చుకుంటూ. ఓటింగ్ శాతం పెరిగేందుకు ఓటర్లలో చైనాతన్యం కలిగించేందుకు కృషి చేయడమే తప్ప నిర్బంధ ఓటింగ్ ఇప్పట్లో సాధ్యమయ్యే వ్యవహారం కాదని ఖురేషీ అభిప్రాయపడ్డారు.

English summary
greater hyderabad municipal corporation(ghmc) once going witnessed poor voter turnout. several polling booths in ghmc region receives less than 15 percent voting till evening. regarding this, huge debate going on in social media about Compulsory voting. bjp veteran lk advani always supports compulsory voting. here is hat other countries fallow
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X