హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గులాబీ పార్టీలో ప‌ద‌వుల పంప‌కాలు షురూ..! క‌ష్ట‌ప‌డ్డ వారికి నామినేటెడ్ ప‌ద‌వులు రెడీ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అదికార గులాబీ పార్టీలో ప‌ద‌వుల పందారం మొద‌లు కాబోతోంది. మంచి రోజులు లేవు కాబ‌ట్టి ప్ర‌క‌ట‌న‌లో జాప్యం జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ప‌ద‌వుల పంప‌కాల గురించి ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఆద్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో నామినేటెడ్ ప‌ద‌వులు ఎవ‌రెవ‌రికి క‌ట్ట‌బెట్టాలి అనే అంశం పై లోతైన చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇక సంక్రాంతి పండుగ త‌ర్వాత నామినేటెడ్ ప‌ద‌వుల‌కు సంభందించి ప్ర‌క‌ట‌న ఉంటుందిని ప్ర‌గతి భ‌వ‌న్ వ‌ర్గాలు నిర్ధారిస్తున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ ఫుల్ జోష్..!! క‌ష్టప‌డ్డ వారికి స‌ముచిత స్థానం..!!

టీఆర్ఎస్ పార్టీ ఫుల్ జోష్..!! క‌ష్టప‌డ్డ వారికి స‌ముచిత స్థానం..!!

గులాబీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక స్వల్ప వ్యవధిలోనే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నామినేటెడ్‌ పదవుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నారు. సోమవారం నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా స్టీఫెన్సన్‌ను నియమించిన కేసీఆర్‌, మంగళవారం పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిని నియమించారు. రానున్న రోజుల్లో కీలకమైన ఆర్టీసీ చైర్మన్‌, మిషన్‌ భగీరథ వైస్‌చైర్మన్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వంటి కీలక పదవులతో పాటు మరిన్ని నామినేటెడ్‌ పదవుల భర్తీ జరుగుతుందని టీఆర్‌ఎ్‌సలోని ఆశావహులు భావిస్తున్నారు.

కేటీఆర్ అభిమాన సంఘాలపై ఆయన గుస్సా.. అన్ని రద్దు...! ఎందుకలా? కేటీఆర్ అభిమాన సంఘాలపై ఆయన గుస్సా.. అన్ని రద్దు...! ఎందుకలా?

మంచిరోజులు లేవు..! సంక్రాంతి త‌ర్వాత ప‌ద‌వుల పంప‌కాలు..!!

మంచిరోజులు లేవు..! సంక్రాంతి త‌ర్వాత ప‌ద‌వుల పంప‌కాలు..!!

ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌, ఇతర నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఆయా పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పదవులన్నింటినీ భర్తీ చేయాలని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం భావిస్తోంది. ఈ దఫా రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన నామినేటెడ్‌ పదవులను పార్టీ వీర విధేయులకు కట్టబెట్టాలనే తలంపుతో ముఖ్య నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ పదవి వరించినట్లుగా టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

అంద‌రికి స‌మ‌న్యాయం..! నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వాల‌ని నిర్ణ‌యం..!!

అంద‌రికి స‌మ‌న్యాయం..! నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వాల‌ని నిర్ణ‌యం..!!

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన నాయకులకు నామినేటెడ్‌ పదవుల భర్తీలో పెద్దపీట వేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే మిగిలిన నామినేటెడ్‌ పదవుల్లోనూ ఎక్కువగా పార్టీ నేతలకు కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు. అన్ని రకాలు, స్థాయిల్లోని నామినేటెడ్‌ పదవులను పరిగణనలోకి తీసుకుంటే, వాటి సంఖ్య దాదాపు ఐదారు వంద‌ల‌ వరకు ఉంటుందని, పార్టీ కోసం పనిచేసిన వారంద‌రికి అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్ర‌శేఖ‌ర్ రావు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ..! కీల‌క ప‌ద‌వుల పంప‌కాల‌పై చ‌ర్చ‌..!!

కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ..! కీల‌క ప‌ద‌వుల పంప‌కాల‌పై చ‌ర్చ‌..!!

గులాబీ పార్టీ అధినేత చంద్ర‌శేఖ‌ర్ రావుతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యా రు. అధినేత ఆదేశం మేరకు కేటీఆర్‌ నిత్యం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చి పార్టీ నేతలను కలవటమేకాక, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న పలువురిని కలిశారు. ఆ త‌ర్వాత కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వారి మధ్య టీఆర్‌ఎస్‌ సంస్థాగత వ్యవహారాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
After his short time in office, the trs party came to power in second time, the head of the party, KCR, who appointed Stephenson as nomined MLA on Monday, and also appointed as the Chairman of the Civil Supplies Corporation, Mr. Srinivas Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X