• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ ప్రభుత్వం కరెంటు బాకీలు.. ఎన్ని కోట్లంటే.. కష్టాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు..!

|

హైదరాబాద్ : ప్రభుత్వ సంస్థల కరెంటు బకాయిలు.. విద్యుత్ పంపిణీ సంస్థల ఇబ్బందులకు కారణమవుతున్నాయి. కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండటంతో డిస్కమ్‌లకు తలనొప్పిగా మారాయి. ఈ బాకీలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా సింగిల్ పైసా రాక తిప్పలు పడుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వివిధ ప్రభుత్వ విభాగాల కరెంటు బిల్లుల బకాయిలు దాదాపు 9 వేల కోట్లకు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పెండింగ్ బకాయిలను సింగిల్ పేమెంట్ కింద తీరుస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరితే గానీ డిస్కమ్‌ల బాధ తప్పేలా లేదు.

అప్పటినుంచే పెండింగ్.. ఏళ్ల నుంచి అదే తీరు

అప్పటినుంచే పెండింగ్.. ఏళ్ల నుంచి అదే తీరు

2004 లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. కానీ అది జరగలేదు. విద్యుత్ పంపిణీ సంస్థలకు కరెంటు పెండింగ్ బకాయిలు బదిలీ కాలేదు. స్థానిక సంస్థల కరెంటు బిల్లులు ఏ పద్దు నుంచి చెల్లించాలో తెలియని పరిస్థితి.

అలా గ్రామపంచాయతీలకు సంబంధించిన కరెంటు బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఇప్పటికీ కూడా ఏళ్లకు ఏళ్లుగా బిల్లులు చెల్లించలేని పంచాయతీలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం తమకు నిధులు కేటాయించడం లేదని ఆయా ప్రభుత్వ విభాగాల అధిపతులు వాపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే డిస్కమ్‌లకు కరెంట్ బిల్లులు చెల్లించలేకపోతున్నామనేది వారి వాదనగా కనిపిస్తోంది.

తెలంగాణ జలీల్ ఖాన్.. బీకామ్ ఫిజిక్స్‌ను తలదన్నిన రాజకీయ వారసుడు..!

 9వేల కోట్లకు పైగా బకాయిలు

9వేల కోట్లకు పైగా బకాయిలు

వివిధ ప్రభుత్వ విభాగాల కరెంటు వాడకానికి సంబంధించి 9 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెండింగులో ఉండటం గమనార్హం. అందులో అత్యధికంగా లిఫ్ట్ ఇరిగేషన్ విభాగం 3 వేల 747 కోట్లు, మైనర్ గ్రామ పంచాయతీలు 2 వేల 350 కోట్లు బకాయిలు, ఇరిగేషన్ ఒక వేయి 33 కోట్లు, మేజర్ గ్రామ పంచాయతీలు 622 కోట్లు బకాయి పడ్డాయి. ఇన్ని వేల కోట్లు డిస్కమ్‌లకు చెల్లిస్తే అవి కష్టాల నుంచి బయటపడతాయి. ఆ క్రమంలో ఇటీవల పెండింగ్ బకాయిలను వన్ టైమ్ కింద తీర్చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరితే గానీ డిస్కమ్‌ల బాధ తప్పేలా లేదు.

సీఎం హామీ.. పెండింగ్ బిల్లులు క్లియరయ్యేనా?

సీఎం హామీ.. పెండింగ్ బిల్లులు క్లియరయ్యేనా?

పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని సీఎం హామీ ఇచ్చినప్పటికీ అది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 9వేల కోట్ల రూపాయల బాకీలు ఎలా చెల్లిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతుబంధు, రుణమాఫీ అమలు చేసేందుకే సరిపడా నిధుల్లేక తిప్పలు పడుతున్న ప్రభుత్వం కరెంట్ బిల్లులు ఎలా కడుతుందనే అనుమానాలొస్తున్నాయి.

రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌ల పరిధిలో స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన కరెంట్ బిల్లులు ఏ ఏటికాయేడు పెరిగిపోతూనే ఉన్నాయి. సకాలంలో కరెంట్ బిల్లు కట్టకపోతే బకాయిలపై ఏడాదికి 18 శాతం వడ్డీ కూడా పడుతుంది. కొన్ని సందర్బాల్లో డిస్కమ్‌లు కరెంట్ కట్ చేసి గవర్నమెంట్ ఆఫీసులు, మున్సిపాలిటీల నుంచి నామమాత్రంగా బిల్లులు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ పేరుకుపోయిన బకాయిలను పూర్తిస్థాయిలో రాబట్టలేకపోతున్నాయి.

హయత్‌నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు.. అసలు కథ ఇదే.. నిందితుడు ఏమన్నాడంటే..!

లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా ఓ సమస్యే..!

లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా ఓ సమస్యే..!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ముందస్తు చెల్లింపుల హామీ పత్రం (Letter Of Credit - LC) నిబంధన డిస్కమ్‌లకు ఇబ్బందికరంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని విద్యుత్తు సంస్థల నుంచి కరెంటు కొనుగోలు చేయాలంటే కొత్త రూల్స్ ఫాలో కావాల్సి ఉంది. ఆ మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి ముందస్తు చెల్లింపుల హామీ పత్రం (Letter Of Credit - LC) సమర్పించాల్సి ఉంటుంది.

ఆ క్రమంలో ఆర్థిక చేయూత కోసం.. రుణాల గ్యారంటీ కోసం స్టేట్ గవర్నమెంటును డిస్కమ్‌లు పదేపదే కోరుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కరెంట్ కష్టాలు తప్పవేమో అనే రీతిలో సమస్య జఠిలంగా మారనుందనే వాదనలు లేకపోలేదు.

English summary
Current dues of Telangana government agencies causing problems for power distribution companies. Discounts have become a headache as the crores of rupees are pending. These dues are being paid by the government while the single penny arrives. The balance of gram panchayats, municipalities and various government departments is over Rs 9,000 crore. CM KCR's promise to meet the pending dues under single payment will not be a cause of discomfort. CM KCR's promise to pay the all dues in one single payment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X