హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

21న ప్రగతి భవన్ ముట్టడి : రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడడం వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కార్మికులకు మద్దతుగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈనేపథ్యంలోనే కార్మికులతో కలిసి ఈనెల 21న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేసుకున్నది హాత్మహత్యలు కాదని అవి ప్రభుత్వం చేసిన హత్యలుగా అభివర్ణించారు. వెంటనే కార్మికులతో చర్చలు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు కోరుతున్నట్టుగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని అన్నారు.

ఈ నేపథ్యంలనే సీఎం కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకున్నా పంటితో తీస్తానన్న కేసీఆర్, ప్రస్తుతం ఎందుకు అణిచివేత ధోరణికి పాల్పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక కార్మీకులు చేపట్టిన రాష్ట్రబంద్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మరోకాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సైతం ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు. ఇక కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మంత్రులంతా తెలంగాణ ద్రోహులేనని అన్నారు. ఓవైపు సీఎం ఆర్టీసీ కార్మికులంతా డిస్మిస్ అయ్యారని చెబుతుంటే... మరోవైపు మంత్రులు చర్చలకు రావాలని పిలుస్తున్నారని అన్నారు.

 Pragati Bhawan will have been blocked on the 21st : congress

ఇక సమ్మె విషయంలో ప్రభుత్వం నియతృత్వ ధోరణిని అవలంభిస్తుందని మరోనేత దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఏ రాష్ట్రంలో కూడ ముఖ్యమంత్రులు ఇంత నియతృత్వంగా వ్వహహరించరని అన్నారు. సమ్మెపై కేంద్రం కూడ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు ఎంపీ కేకే ఆర్టీసీని విలీనం చేయడం సాధ్యం కాదని ప్రకటించడం పై ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు.ఆయన ప్రకటనను పూర్తిగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

English summary
Pragati Bhawan will have been blocked on the 21st of this month congress mp revanth reddy said .RTC Workers commit suicide by provoking ministers he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X