హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమర్శలను ప్రశంసలుగా మారుస్తున్న మంత్రి... ఈటల పనితీరు తెలంగాణ సర్కార్‌కు బిగ్ రిలీఫ్...

|
Google Oneindia TeluguNews

కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు టెస్టుల సంఖ్యను పెంచింది. బులెటిన్‌ను మరింత సంక్షిప్తంగా విడుదల చేస్తోంది. ఇక మంత్రి ఈటల పనితీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Recommended Video

గాంధీ ఆసుపత్రి లో రోజు 30 నుండి 50 మంది కరోనాతో చనిపోతున్నట్లు అనుమానం : జగ్గారెడ్డి
స్వయంగా ప్రతీ పేషెంట్‌తో మాట్లాడిన ఈటల...

స్వయంగా ప్రతీ పేషెంట్‌తో మాట్లాడిన ఈటల...

ఇటీవలి కాలంలో మరింత యాక్టివ్‌గా పనిచేస్తున్న ఈటల.. స్వయంగా కరోనా వార్డులకు వెళ్లి మరీ పేషెంట్లతో మాట్లాడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులే కరోనా పేషెంట్ల సమీపానికి వెళ్లేందుకు కూడా భయపెడుతున్న తరుణంలో.. ఈటెల స్పూర్తివంతంగా వ్యవహరించడంపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.ఆదివారం(అగస్టు 3) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (టిమ్స్‌)ను ఈటల సందర్శించారు. కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్న వార్డులో కలియతిరుగుతూ వారి బాగోగులు తెలుసుకున్నారు. ప్రతీ పేషెంట్‌తో మాట్లాడి వాళ్లకు అందుతున్న ట్రీట్‌మెంట్,ఫుడ్ ఇతరత్రా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైరస్ లోడ్ ఎక్కువై పేషెంట్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఐసీయూలోకి కూడా వెళ్లి వారిని పరామర్శించారు.

విమర్శలను ప్రశంసలుగా మారుస్తున్న మంత్రి...

విమర్శలను ప్రశంసలుగా మారుస్తున్న మంత్రి...

వైద్యారోగ్య శాఖ మంత్రి హోదాలో ఈటల కరోనా పేషెంట్ల వార్డులోకి వెళ్లి మరీ వాళ్లతో మాట్లాడటాన్ని చాలామంది అభినందిస్తున్నారు. ఈటల స్పూర్తివంతంగా పనిచేస్తున్నారని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. బహుశా దేశంలో ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇలా స్వయంగా కరోనా వార్డుల్లోకి వెళ్లి పేషెంట్లతో మాట్లాడలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నియంత్రణ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్న ప్రభుత్వానికి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈటల తన పనితీరుతో విమర్శలను ప్రశంసలుగా మార్చడం అభినందనీయమే.

అందరికీ భరోసానిస్తూ...

అందరికీ భరోసానిస్తూ...

టిమ్స్‌ను సందర్శించిన సందర్భంగా కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు చికిత్సఅందిస్తున్నడాక్టర్లు, ఆరోగ్యసిబ్బంది, శానిటేషన్‌ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందితోనూ ఈటల స్వయంగా మాట్లాడారు. ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని భరోసానిచ్చారు. శక్తివంచన లేకుండా రోగులకు సేవ చేయాలని ప్రోత్సహించారు. కార్పోరేట్ ఆస్పత్రుల కంటే మెరుగైన సదుపాయాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్నామని ఈ సందర్భంగా ఈటల చెప్పారు. విశాలమైన వార్డుల్లో పడకలు ఏర్పాటు చేసి పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

విమర్శలను ఒక్కడే ప్రత్యక్షంగా ఎదుర్కొంటూ...

విమర్శలను ఒక్కడే ప్రత్యక్షంగా ఎదుర్కొంటూ...

ఫిర్యాదులపై స్పందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సదుపాయాలు కల్పిస్తున్నారని.. కాబట్టి ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సదుపాయాలు,తీసుకుంటున్న చర్యలను ఈటల జనంలోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. అన్ని రకాల విమర్శలను ప్రత్యక్షంగా ఆయన మాత్రమే ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.

English summary
Minister Etela Rajender getting praises from telangana people for visiting covid 19 hospitals and interacting with them directly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X