హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ బయోటెక్ లో కరోనా వ్యాక్సిన్ పురోగతి సమీక్షించిన ప్రధాని మోడీ .. ఇది గొప్ప ప్రేరణ అన్న సంస్థ

|
Google Oneindia TeluguNews

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ముగిసింది . కరోనా వ్యాక్సిన్ పురోగతిపై సమీక్షించడానికి ఒక రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థకు చేరుకుని వ్యాక్సిన్ యొక్క అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. అక్కడి శాస్త్రవేత్తలతో 40 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు మోడీ. వ్యాక్సిన్ ప్రయోగ శాలను సందర్శించారు. వ్యాక్సిన్ యొక్క పురోగతిపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

30 కోట్ల మందికి కరోనా హై రిస్క్ .. వ్యాక్సిన్ ఇవ్వటానికి పోల్ బూత్ లాంటి వ్యవస్థ : నీతి ఆయోగ్ 30 కోట్ల మందికి కరోనా హై రిస్క్ .. వ్యాక్సిన్ ఇవ్వటానికి పోల్ బూత్ లాంటి వ్యవస్థ : నీతి ఆయోగ్

కోవిడ్ వ్యాక్సిన్ పరీక్షలలో పురోగతి సాధించినందుకు శాస్త్రవేత్తలను అభినందించిన మోడీ

భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది . భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ పురోగతిని గురించి ట్వీట్ చేసిన పిఎం నరేంద్ర మోడీ, భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు కోవిడ్ -19 వ్యాక్సిన్ పురోగతి గురించి తనకు వివరించినట్లు చెప్పారు. కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి పరిచే క్రమంలో ఇప్పటివరకు పరీక్షల్లో పురోగతి సాధించిన భారత్ బయోటెక్ సంస్థ శాస్త్రవేత్తల బృందం ఐసిఎంఆర్ తో కలిసి పనిచేస్తోందని పిఎం మోడీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పరీక్షలలో పురోగతి సాధించినందుకు శాస్త్రవేత్తలను అభినందించారు.

భారత్ బయోటెక్ శాస్త్రవేత్తల బృందం ఐసిఎంఆర్ తో కలిసి పనిచేస్తోందని పిఎం మోడీ ట్వీట్

వేగవంతమైన పురోగతికి వీలుగా వారి బృందం ఐసిఎంఆర్ తో కలిసి పనిచేస్తోందని పిఎం మోడీ ట్విట్టర్లో తెలిపారు.

హైదరాబాద్ నుంచి భారత్ బయోటెక్ సందర్శించిన మోడీ అక్కడ వ్యాక్సిన్ పురోగతిని తెలుసుకున్న తర్వాత తిరిగి పూణే కు పయనమయ్యారు. కాన్వాయ్ లో హకీంపేట కు బయలుదేరిన మోదీ భారత్ బయోటెక్ నుంచి 20 నిమిషాల్లోనే హకీంపేట కు చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై స్పందిస్తూ, భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది .

Recommended Video

PM Kisan Samman Nidhi Yojna : అన్నదాతలకు కేంద్రం గుడ్‌న్యూస్... రైతుల ఖాతాల్లో రూ.2000!
ప్రధాని పర్యటన మా శాస్త్రవేత్తల బృందానికి గొప్ప ప్రేరణ : భారత్ బయోటెక్

ప్రధాని పర్యటన మా శాస్త్రవేత్తల బృందానికి గొప్ప ప్రేరణ : భారత్ బయోటెక్


"ప్రధానమంత్రి పర్యటన మా శాస్త్రవేత్తల బృందానికి గొప్ప ప్రేరణగా ఉపయోగపడుతుందన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణ, ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడం మరియు కోవిడ్ -19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటం పట్ల మా నిబద్ధతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ "26,000 మంది కోవాక్సిన్ మూడవ ఫేజ్ ట్రయల్ భారతదేశం అంతటా నిర్వహించబడుతోందని , ఈ టీకా ప్రపంచంలోనే ఏకైక బయో సేఫ్టీ లెవల్ 3 ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి చేయబడుతుందని తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday visted Bharat Biotech's facility in Hyderabad to review coronavirus vaccine development work. Bharat Biotech's Covaxin is undergoing phase-3 trials.PM Narendra Modi, who tweeted about his visit to the Bharat Biotech facility, said he was briefed about the progress on the Covid-19 vaccine.PM Modi also said that the team at Bharat Biotech facility is working closely working with ICMR to "facilitate speedy progress" of the coronavirus vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X