హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిద్దరు సన్నిహితంగా ఉండటం జీర్ణించుకోలేక .. సతీశ్ మర్డర్‌పై పోలీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తోంది. పూటకో ట్విస్ట్, రోజుకో ఇష్యూ తెరపైకి వస్తోంది. హత్య కేసు మాత్రం హేమంత్, ప్రియాంక చుట్టూనే తిరుగుతుంది. కేసుకు సంబంధించి కీలక అంశం పోలీసు విచారణలో వెల్లడైంది. సతీశ్ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికితోడు సతీశ్-ప్రియాంక సన్నిహితంగా ఉండటం చూసి హేమంత్ ఒర్చుకోలేకపోయాడు. అందుకే డ్రింక్ చేద్దామని పిలిచి .. తన చిన్ననాటి స్నేహితుడినే మట్టుబెట్టాడు.

హేమంత్, ప్రియాంక ..

హేమంత్, ప్రియాంక ..

సతీశ్ హత్య కేసు .. హేమంత్, ప్రియాంక చుట్టూ తిరుగుతుంది. సతీశ్‌ను హత్య చేసింది హేమంతే.. కానీ ఎందుకు హతమార్చాడనే అంశంపై పోలీసుల విచారణ సాగుతుంది. ఈ కేసు కొలిక్కి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. సతీష్‌కు హత్యకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలేనని పోలీసులు తేల్చారు. కూకట్ పల్లిలో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీలో వాటాలకు సంబంధించి గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ఆ విషయంలో తనకు అన్యాయం జరిగిందని హేమంత్ భావించాడు. కానీ సతీశ్‌ సవ్యంగా ఉంటూనే .. ఇంటికి పిలిచాడు.హేమంత్ మనసులోని దుర్భిద్దిని గమనించని సతీశ్ .. డ్రింక్‌కు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

హేమంత్ ద్వారానే

హేమంత్ ద్వారానే

మర్డర్ కేసులో మరో ట్విస్ట్‌ను పోలీసులు తెలిపారు. ప్రియాంకను హేమంత్ తీసుకొచ్చారని పోలీసులు చెప్తున్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చుకొని .. అక్కడే ఉద్యోగం కూడా ఇచ్చారని వివరించారు. అయితే ఇంతలో ప్రియాంక-సతీశ్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యింది. వారిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారని .. ఆఫీసు సిబ్బంది చెప్పడం .. స్వయంగా చూసిన హేమంత్ జీర్ణించుకోలేకపోయారు. గత గురువారం మద్యం సేవించాక ... ఆర్థిక లావాదేవీల గురించి వారి మధ్య డిస్కషన్ జరిగింది. తర్వాత ప్రియాంక గురించి కూడా ప్రస్తావన వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. అప్పటికే కోపోద్రిక్తుడైన హేమంత్ .. అక్కడే ఉన్న రాడ్డుతో సతీశ్ తలపై బాదిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యతో ప్రియాంకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. సతీశ్ చనిపోయాడని తెలిసి ప్రియాంక షాక్‌నకు గురైందని పేర్కొన్నారు. మర్డర్ కేసుకు సంబంధించి సతీశ్, హేమంత్, ప్రియాంక మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్, వీడియో కాలింగ్ డేటాను కూడా పోలీసులు పరిశీలించారు.

వివాహేతర సంబంధం మాత్రం ...

వివాహేతర సంబంధం మాత్రం ...

సతీశ్ మంచివారని .. అతనికి ప్రియాంకతో వివాహేతర సంబంధం లేదని అతని భార్య ప్రశాంతి పేర్కొన్నారు. దుష్ప్రచారం చేయొద్దని హితవు పలికారు. ఆమె విన్నవించినట్టు పోలీసుల విచారణలో కూడా వారి మధ్య వివాహేతర సంబంధం లేదని తెలిసింది. ఈ విషయం స్వయంగా ప్రియాంక కూడా విచారణలో .. ఇటు మీడియాకు కూడా తెలిపారు. మరోవైపు కూకట్‌పల్లిలోని సాప్ట్‌వేర్ కంపెనీ మంచి లాభాల్లోనే ఉందని పోలీసులు తెలిపారు. వారు ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారని కూడా గుర్తుచేశారు. అందులో కూడా లాభాలే వస్తున్నాయని .. వీటికి సంబంధించి ఘర్షణ జరిగి .. సతీశ్ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

English summary
A key aspect of Satish's murder case has been revealed in the police investigation. The police initially confirmed that financial transaction was the main reason for murder. In addition, Hemant was unable to see Satish-Priyanka in close contact. That's why he called to drink and murder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X