హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ నలుగురికి ఉరే సరి, కోర్టులో వారి తరఫున వాదనలు వినిపించొద్దు, లాయర్లకు ప్రియాంక తండ్రి రిక్వెస్ట్

|
Google Oneindia TeluguNews

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి కోరుతున్నారు. కేసును మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించడాన్ని స్వాగతించారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తిచేసి, నిందితులకు శిక్ష ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఓ తండ్రిగా కోరుకుంటున్నానని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

రేప్ సమయంలోనే ముక్కు, నోరు మూసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి: ప్రియాంక మృతిపై సీపీ సజ్జనార్ వివరణ రేప్ సమయంలోనే ముక్కు, నోరు మూసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి: ప్రియాంక మృతిపై సీపీ సజ్జనార్ వివరణ

వాదనలు వినిపించొద్దు.. ప్లీజ్..

వాదనలు వినిపించొద్దు.. ప్లీజ్..

మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో నిందితుల తరఫున ఎవరు వాదనలు వినిపించొద్దని శ్రీధర్ రెడ్డి కోరారు. తన విన్నపానికి లాయర్లు సహకరిస్తే రుణపడి ఉంటానని పేర్కొన్నారు. నిందితులు ఎవరో తమకు తెలియదని.. బండి పెట్టి వెళ్లగానే చూసి వేచి చూశారని పేర్కొన్నారు. లారీ లోడ్ కాకపోవడంతోనే ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితులకు ఉరి శిక్షతో తన బిడ్డ ఆత్మ శాంతిస్తోందని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

వెన్నులో వణుకు

వెన్నులో వణుకు

ప్రియాంక ఘటనతో అమ్మాయిలను బయటకి పంపించాలంటే భయమేస్తోందని శ్రీధర్ రెడ్డి అన్నారు. తమకు మరో పాప ఉందని, డ్యూటీకి పంపించాలంటే భయపడుతున్నామని చెప్పారు. విశ్వనగరిలో భద్రత డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. దీంతోపాటు పిల్లలపై పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవాలని సూచించారు.

అవగాహన కల్పించాలి

అవగాహన కల్పించాలి

ఒకవేళ బస్సు లేటయితే ఎలా వెళ్లాలి. ఎవరి సాయం తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు. నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధిస్తేనే ప్రియాంక ఆత్మ శాంతిస్తోందని చెప్పారు. కోర్టులో లాయర్లు వాదనలు వినిపించొద్దని శ్రీధర్ రెడ్డి విన్నవించారు.

ఇదీ విషయం

ఇదీ విషయం

ప్రియాంక వాహనం తీసుకొని వచ్చాక లారీ వెనకాలకు ఆరిఫ్, చెన్నకేశవులు తీసుకెళ్లారని చెప్పారు. నోరుని మూసివేసి లైంగికదాడి చేశారని చెప్పారు. ఆ తర్వాత నవీన్, శివ కూడా లైంగికదాడి చేశారన్నారు. లైంగికదాడి చేసే సమయంలో ముక్కు మూయడంతో ప్రియాంకరెడ్డి చనిపోయారని తెలిపారు. తర్వాత మృతదేహాన్ని లారీలో వేసి.. మరోచోటికి తీసుకెళ్లారని.. వెనకాల నవీన్, శివ స్కూటీ మీద వచ్చారని వివరించారు.

10.30 గంటలకు..

10.30 గంటలకు..

రాత్రి 10.30 గంటలకు వారు బయల్దేరారని చెప్పారు. అలా ప్రియాంకను నిర్జీవ ప్రదేశంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారని పేర్కొన్నారు. స్కూటీని కూడా 10 కిలోమీటర్ల దూరంలో వదిలివేశారని చెప్పారు. ఈ కేసును మహబూబ్ నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నామని చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆధారాలు సమర్పిస్తామని సీపీ సజ్జనార్ చెప్పారు.

English summary
priyanka father sridhar reddy urge to lawyers, dont argue accused in priyanka case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X