హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Priyanka reddy murder:మహిళ వైద్యురాలికి కరవైన భద్రత: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

|
Google Oneindia TeluguNews

ప్రియాంక రెడ్డి హత్యను యావత్ జాతి ముక్తకంఠంతో ఖండిస్తోంది. బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ విచారం వ్యక్తం చేశారు. ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారం చేసి.. కిరాతకంగా హత్య చేశారని తెలిసి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ధైర్యంగా ఉండండి.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. ప్రియాంక కుటుంబానికి మంత్రి సబితా పరామర్శ ధైర్యంగా ఉండండి.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. ప్రియాంక కుటుంబానికి మంత్రి సబితా పరామర్శ

 కఠిన చర్యలు

కఠిన చర్యలు

ప్రియాంకరెడ్డి ఘటన తెలిసి బాధ కలిగిందని రాజాసింగ్ అన్నారు. అత్యాచారం చేసి హత్య చేశారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. వారిపై నిర్బయ చట్టం కింద చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

కరవైన రక్షణ

కరవైన రక్షణ

ప్రియాంకరెడ్డి హత్య దారుణమైన ఘటన అని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మహిళ వైద్యురాలికి భద్రత కరువైందని మండిపడ్డారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని చెబుతోన్నా ప్రభుత్వం.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మిగతా యువతులు బయటకి రావాలంటేనే భయపడి పోయే పరిస్థితి ఉందన్నారు.

ఏం చేస్తున్నారు..?

ఏం చేస్తున్నారు..?

ప్రియాంకరెడ్డి హత్యతో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తేలిపోయిందన్నారు. ఈ ఘటనను యావత్ జాతి గమనిస్తోందని చెప్పారు. తెలంగాణలో మహిళలకు సరైన భద్రత లేదని సందేశం వెళ్లిందన్నారు. ఘటన జరిగిన తర్వాత విచారణ చేసి నిందితులను పట్టుకునే బదులు.. కీచకపర్వం జరగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
పథకం ప్రకారమే..

పథకం ప్రకారమే..

ప్రియాంక స్కూటీని అహ్మద్ పాషా అండ్ కో ఫాలో అయినట్టు తెలుస్తోంది. ఆమె వచ్చి క్యాబ్‌లో వెళ్లాక.. స్కూటీని పంక్చర్ చేశారని సమాచారం. ఆమె వచ్చాక.. పంక్చర్ చేయిస్తామని ముందుకొచ్చారు. బండి తీసుకొని వెళ్లి.. పంక్చర్ షాపు లేదని నటించినట్టు ప్రాథమికంగా పోలీసులు వెల్లడించారు. తర్వాత అక్కడినుంచి ఆమెను తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

English summary
bjp mla raja singh ask cm kcr take serious action priyanka culprits
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X