హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర శివారులోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియాంక రెడ్డి కేసులో సైబారాబాద్ పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. అర్ధరాత్రికి ప్రధాన అనుమానితుడిని అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత మరో ముగ్గురు అనుమానితులు నవీన్ (డ్రైవర్), శివ (క్లీనర్), కేశవ్ (క్లీనర్) అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు.

Priyanka reddy murder: మా ఫిర్యాదుకు పోలీసులు స్పందిస్తే మా పాప బ్రతికేది : ప్రియాంక తల్లిదండ్రులు Priyanka reddy murder: మా ఫిర్యాదుకు పోలీసులు స్పందిస్తే మా పాప బ్రతికేది : ప్రియాంక తల్లిదండ్రులు

ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య

ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య

నిందితులు నారాయణపేట జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. టోల్‌ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. గురువారం తెల్లవారుజామున 3-4 గంటల మధ్య సమయంలో హత్య చేసి ఉంటారని శవపరీక్షలో తేలింది. ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ప్రియాంక రెడ్డిని కిరోసిన్ పోసి చంపినట్లు డాక్టర్లు చెప్పడంతో లారీ డ్రైవర్లే హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. మెడను చున్నీతో బిగించి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రియాంక తలపై వైద్యులు గాయాన్ని గుర్తించారు.

రాత్రి ఫోన్ చేసింది.. ఆ తర్వాత

రాత్రి ఫోన్ చేసింది.. ఆ తర్వాత

ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యపై బాధితురాలి తల్లి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని, ఎన్నోసార్లు రాత్రి 9గంటలకు ఇంటికి వచ్చేదని చెప్పారు. దారుణం జరిగిన రోజు 9.20కి ఫోన్ చేసిందని, తనకు మందులు తీసుకువస్తానని చెప్పిందని తెలిపారు ప్రియాంక తల్లి. ఆ తర్వాత ఫోన్ చేస్తే ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని చెప్పారు. దీంతో తాము ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందేమో అనుకున్నామని తెలిపారు. వెంటనే రోడ్డు వెంట వెళ్లామని చెప్పారు.

పోలీసులు అటూ ఇటూ తిప్పారు..

పోలీసులు అటూ ఇటూ తిప్పారు..

బుధవారం రాత్రి 10గంటల తర్వాత ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాము రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే వారు తమ పరిధి కాదని చెప్పడంతో మరో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఇలా అటూ ఇటూ తిప్పిడంతో వృథా అయ్యిందన్నారు. ఒక్క కానిస్టేబుల్ ను మాత్రమే తన భర్త వెంట పంపించారని చెప్పారు.

మా పాప ఏం పాపం చేసిందంటూ కన్నీరు..

మా పాప ఏం పాపం చేసిందంటూ కన్నీరు..

తనకు పెళ్లి చేద్దామనుకున్న సమయంలో ఇలాంటి ఘోరం జరిగిందని ప్రియాంక తల్లి కన్నీరుమున్నీరయ్యారు. తనను ఎప్పుడూ విడిచిపెట్టి ఉండేది కాదని, ఎక్కడికెళ్లినా తమతోపాటే వెళ్లేదని చెప్పారు. పెట్రోల్ పోసి చంపారంటూ కన్నీరుమున్నీరైంది. మా పాప ఏం పాపం చేసిందండి అంటూ ఆవేదన గురయ్యారు. తమ చిన్న కూతురును నైట్ డ్యూటీలకు పంపాలంటే భయం వేస్తోందని అన్నారు. చిన్న వయస్సులోనే తుంచేశారని, పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాల్సిన సమయంలో చంపేశారని కంటతడిపెట్టారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
లవర్‌తో వెళ్లిపోయుండొచ్చు అంటూ పోలీసులు.. బాధగా..

లవర్‌తో వెళ్లిపోయుండొచ్చు అంటూ పోలీసులు.. బాధగా..

పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో పోలీసులు స్పందించిన తీరు బాధగా ఉందని ప్రియాంక రెడ్డి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. లవర్‌తో పోయిందని.. హాస్పిటల్‌కు వెళ్లిందా? లేక ఎవరితోనైనా వెళ్లిందా? అని మాట్లాడారని అన్నారని వాపోయారు. తమ అమ్మాయి అలాంటిది కాదన్నా వినలేదని తెలిపారు. పోలీసులు తాము ఫిర్యాదు చేసిన సమయంలో వెంటనే స్పందించివుంటే ప్రియాంక తమకు దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కఠినంగా శిక్షించాలి..

కఠినంగా శిక్షించాలి..


నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు ప్రియాంక రెడ్డి తల్లి చెప్పారు. నరరూప రాక్షసుల్లా ఘోరానికి పాల్పడ్డారని, వాళ్ల ఇళ్లల్లో అమ్మాయిలు లేరా? అని ప్రశ్నించారు. కఠిన శిక్షలు లేకనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయన్నారు.
ఇలాంటి నిందితులకు బహిరంగ ఉరిశిక్షలు వేయాలన్నారు. తమకు జరిగిన అన్యాయం వేరే వాళ్లకు జరగకూడదన్నారు.

English summary
priyanka reddy rape and murder: police responce is very bad says Priyanka Mother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X