చిరుపైనే నట్టికుమార్ నమ్మకం.. వారంతా ప్రమోషన్స్ కోసమేనట.. మరీ ఆచార్య..
సినీ ఇండస్ట్రీ సమస్యలపై చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్‌తో అగ్ర హీరోలు, దర్శకులు సమావేశం అయ్యారు. మహేశ్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజామౌళి, కొరటాల శివ, అలీ, ఆర్ నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి మీట్ అయ్యారు. వీరి భేటీపై నిర్మాత నట్టికుమార్ స్పందించారు. తాము ఒక్క చిరంజీవిని మాత్రమే విశ్వసిస్తున్నామని హాట్ కామెంట్స్ చేశారు.

చిరుపై నమ్మకం..
చిరంజీవిపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. టాలీవుడ్ సమస్యలపై మొదటి నుంచి చిరంజీవి మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం కూడా ఆయన ఒక్కరినే పిలిచి అన్ని విషయాలపై మంతనాలు చేసోందని అభిప్రాయపడ్డారు. చిరంజీవితోపాటు వెళ్లిన రాజమౌళి, ప్రభాస్, మహేష్ గురించి నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మిగిలినవారిది స్వార్థమే
సీఎం జగన్ ను కలిసేందుకు వెళ్లిన వారిలో చిరంజీవిని మాత్రమే నమ్ముతున్నామని నట్టి కుమార్ చెప్పారు. మిగిలిన వారు తమ స్వార్థం కోసమే జగన్ దగ్గరికి వెళ్లారని వివరించారు. రాజమౌళికి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ ఉందని చెప్పారు. అందులో భాగంగానే ఆయన వెళ్లారని చెప్పారు. ఇక ప్రభాస్‌కు రాధేశ్యామ్ సినిమా ఉందని.. మహేష్ బాబుకు సర్కారు వారి పాట ఉందన్నారు. ఈ భారీ సినిమాలు ఉన్నందున వారు సీఎంను కలిశారని చెప్పారు. అందుకోసమే వారందరిని కాక చిరంజీవిని మాత్రమే నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు.

వారి సినిమాలు ఉండటంతో..
రాజమౌళి, ప్రభాస్, మహేష్ జగన్‌ను కలవడంలో ఏ మాత్రం తప్పు లేదని నట్టి కుమార్ అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్, మరి కొన్ని సంస్థలు, సమస్యల పరిష్కారంపై సరిగా స్పందించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి ముందు నిలబడి, మొదటి నుంచీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. టాలీవుడ్ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరీ ఆచార్య
చిరంజీవి మూవీ ఆచార్య కూడా రిలీజ్‌కు ఉంది.. నట్టికుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. కేవలం వారిని ప్రస్తావించి.. చిరును వెనకేసుకు రావడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నట్టి కుమార్ కామెంట్లను బట్టి చూస్తే.. చిరంజీవి ఆచార్య మూవీ డైరెక్టర్ కొరటాల శివ, చిరు, రాధేశ్యామ్ కోసం ప్రభాస్, ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి, సర్కార్ వారి పాట కోసం మహేశ్ బాబు వెళ్లారని అర్థం అవుతుంది. మరోవైపు కమెడీయన్ అలీకి జగన్ మంచి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తారని విశ్వసనీయ సమాచారం. అంటే అందులో ఊరికే వెళ్లి కలిసింది పోసాని కృష్ణ మురళి.. ఆర్ నారాయణ మూర్తి అనే సందేహాం కలుగుతుంది. వారే సినీ ఇండస్ట్రీ సమస్యలను ప్రస్తావించారా అనే డౌటానుమానం కలుగక మానడం లేదు. మరీ దీనిపై నట్టి కుమార్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరీ.