హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మౌనిక మృతి కలిచివేసింది.. మెట్రో స్పందించకపోతే ఆందోళన.. ప్రో కోదండరాం వార్నింగ్

|
Google Oneindia TeluguNews

మెట్రో ఘటనపై అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని ప్రో.కొదండరాం అన్నారు. ఇలాంటీ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మెట్రో అధికారులపై ఉందని అయన అన్నారు. బేషజాలకు వెళ్లకుండా మెట్రో సెఫ్టిపై అధికారులు శ్రద్ద వహించాలని సూచించారు. అవసరమైతే ఉస్మానియా సివిల్ ఇంజనీర్ల భాగస్వామ్యం కూడ తీసుకోవాలని ఆయన కోరారు. ఇక ప్రమాదంలో మృతి చెందిన మౌనిక కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు..

 మౌనిక కుటుంబాన్ని పరామర్శించిన ప్రో.కోదండరాం

మౌనిక కుటుంబాన్ని పరామర్శించిన ప్రో.కోదండరాం


అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో పెచ్చులు ఊడిపడి మృతి చెందిన మౌనిక కుటుంబాన్ని రాజకీయ నేతలు పరామర్శించారు. ఈ నేపథ్యలంలోనే తెలంగాణ జనసమితి ప్రో. కొదండరాం ఇతర వామపక్షపార్టీల నేతలు పరామర్శించారు. సంఘటనపై వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయవద్దని కొదండరాం సూచించారు మెట్రో యాజమాన్యానికి సూచించారు. ఘటనపై మెట్రో అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల తరపున అందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇది మెట్రో అధికారుల హత్య

ఇది మెట్రో అధికారుల హత్య

ఇది ముమ్మాటికి ప్రమాదం కాదని, మెట్రో అధికారుల హత్యగా కమ్యునిస్టు నేతలు అభివర్ణించారు. ఎలాంటీ పర్యవేక్షణ లేకుండా నిర్మాణం జరిగిందని సీపిఐ నేత సుధాకర్ ఆరోపించారు. పిల్లర్లు మాత్రం కంపనీలో తయారైన, ఇతర నిర్మాణాలు మాత్రం అలా జరగలేదని ఆయన చెప్పారు. మరో వైపు సంఘటనపై మెట్రో అధికారుల స్పందన లేకపోవడంతో బేగంపేటలోని మెట్రో కార్యాలయం వద్ద అందోళన నిర్వహించేందుకు మౌనిక కుటుంబ సభ్యులు, ఇతర పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఘటనపై విచారణ చేపట్టిన మెట్రో అధికారులు

ఘటనపై విచారణ చేపట్టిన మెట్రో అధికారులు

మరోవైపు ఘటనపై ఎల్‌ అండ్ టీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రమాద ఘటనపై అంతర్గత విచారణ జరపడంతో పాటు మౌనిక మృత దేహానికి పోస్టుమార్టం జరుగుతున్న గాంధీ ఆసుపత్రికి ఎల్‌ అండ్ అటీ అధికారులు చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఇక సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించడంతో పాటు బాధితురాలి కుటుంబానికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ఎల్ అండ్ అధికారులను ఆదేశించారు.

English summary
Prof. Kodandaram visits the mounika family who died metro station at ameerpet. the government and the Metro officials have to take action such incidents, he demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X