హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపిస్టులకు ఎన్ కౌంటర్ కంటే బెత్తం దెబ్బలే బెటర్: ప్రశాంతంగా చావకూడదు: ప్రొఫెసర్ కే నాగేశ్వర్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నలుగురు కామాంధులను సైబరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ తప్పు పట్టారు. అత్యాచారానికి పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేయడం కంటే బెత్తం దెబ్బలు కొట్టాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా రేపిస్టులకు బెత్తం దెబ్బలు కొట్టాలని చెప్పారు.

డబ్బుల కోసం గ్యాంగ్ రేప్ నాటకం: టోల్ గేట్ వద్దే: అచ్చం దిశ తరహాలోనే..!డబ్బుల కోసం గ్యాంగ్ రేప్ నాటకం: టోల్ గేట్ వద్దే: అచ్చం దిశ తరహాలోనే..!

ఎన్ కౌంటర్ పై ప్రొఫెసర్ కే నాగేశ్వర్..

ఎన్ కౌంటర్ పై ప్రొఫెసర్ కే నాగేశ్వర్..

అత్యాచార నిందితులకు ఎన్ కౌంటర్ చేయడంపై తన అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత పాశవికంగా హతమార్చిన నలుగరు నిందితులు మహమ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును ఈ నెల 6వ తేదీన సైబరాబాద్ పోలీసులు షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి ఫ్లైఓవర్ కింద ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

ఎన్ కౌంటర్ పై నిరసనల వెల్లువ..

ఎన్ కౌంటర్ పై నిరసనల వెల్లువ..

ఈ ఎన్ కౌంటర్ పై సాధారణ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నప్పటికీ.. మేధావులు, వామపక్ష భావజాలం ఉన్న వారూ తీవ్రంగా తప్పు పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ ను సీపీఐ, సీపీఎం సైతం వ్యతిరేకించాయి. ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజావ్యాజ్యం కూడా దాఖలైంది. ఎన్ కౌంటర్ చేయడం వల్ల సైబరాబాద్ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని, న్యాయ వ్యవస్థను కించపరిచారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 ఉరి శిక్ష కన్నా కఠిన శిక్ష అదే..

ఉరి శిక్ష కన్నా కఠిన శిక్ష అదే..


ఈ ఎన్ కౌంటర్ పై ప్రొఫెసర్ కే నాగేశ్వర్ స్పందించారు. ఎన్ కౌంటర్ చేయడం వల్ల ఉపయోగం ఉండబోదని అన్నారు. అత్యాచార నిందితులు జీవించి ఉండగానే.. కఠినాతి కఠినమైన శిక్షలను విధించాలని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా వారికి బెత్తంతో కొట్టాలని అన్నారు. చర్యం చిట్లిపోయేలాగా రక్తమోడేలాగా బెత్తంతో కొట్టాలని చెప్పారు. ఈ దెబ్బలు వారికి జీవితాంతం గుర్తుండి పోయేలా చేస్తాయని అభిప్రాయపడ్డారు. బెత్తం దెబ్బలు మిగిల్చిన బాధలను అత్యాచార నిందితులు జీవితాంతం బాధిస్తాయని అన్నారు.

ఒక్క బుల్లెట్ తో ప్రశాంతంగా ప్రాణాలు వదిలేలా చేయడం కంటే..

ఒక్క బుల్లెట్ తో ప్రశాంతంగా ప్రాణాలు వదిలేలా చేయడం కంటే..


ఎన్ కౌంటర్ చేయడం వల్ల అత్యాచార నిందితులు ఒక్క బుల్లెట్ తో ప్రాణాలను వదులుతారని అన్నారు. అలాంటి సులువైన మరణం వారికి దక్కకూడదని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చెప్పారు. రక్తం కారుతూ కొడుతుంటే రేపిస్టులు ఉరిశిక్ష కంటే ఎక్కువ బాధను అనుభవిస్తారని అన్నారు. అలా కాకుండా.. ఎన్ కౌంటర్ చేయడం వల్ల ఒక్క బుల్లెట్ దెబ్బతో అత్యాచార నిందితులు హాయిగా, ప్రశాంతంగా జీవితాన్ని చాలించినట్టయిందని వ్యాఖ్యానించారు. పోలీసుల లాఠీ దెబ్బలు తింటే వాటి తీవ్రత తెలుస్తుందని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అన్నారు.

English summary
Professor K Nageshwar expressed his opinion on Hyderabad encounter as a video message. He told that Jana Sena Party Pawan Kalyan formula is more better than encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X