హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండలికి నాగేశ్వర్ పోటీ, స్వయంగా ప్రకటన.. గులాబీ బాస్ మద్దతుతో విజయమే..?

|
Google Oneindia TeluguNews

గ్రాడ్యుయేషన్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రముఖ అనలిస్ట్ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ప్రకటించారు. ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోన్న క్రమంలో ఆయనే క్లారిటీ ఇచ్చారు. నాగేశ్వర్ ఇండిపెండెంట్‌గా బరిలోకి పోటీచేస్తారు. అయితే ఆయనకు పోటీ పెట్టబోమని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టంచేశారు. దీంతో నాగేశ్వర్ ఎన్నిక లాంఛనమే అనే ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎన్నిక జరగనుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నాగేశ్వర్ పోటీ చేయబోతున్నారు. వివిధ సంఘాల మద్దతుతో బరిలోకి దిగుతానని తెలిపారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 2014 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు.

professor nageshwar to contest mlc poll

ప్రొఫెసర్ నాగేశ్వర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగనున్నారు. నాగేశ్వర్‌కు పోటీగా టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని నిలబెట్టొద్దని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అంతకుముందు ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరు వినిపించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ను కలువడంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గోరటి వెంకన్న పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

సీఎం కేసీఆర్‌ విధానాలను గోరటి వెంకన్న బాహాటంగా విభేదించిన సందర్భాలు కూడా లేవు. దీంతో ఆయన పేరు పేరు ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల రేసులో ముందువరసలో ఉంది. కానీ అనూహ్యంగా పేర్లు మారిపోయాయి. తెరపైకి నాగేశ్వర్ పేరు వచ్చింది. అయితే ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తోండగా.. టీఆర్ఎస్ మద్దతు తెలిపే అవకాశం ఉంది.

English summary
professor nageshwar to contest graduate mlc polling in next year feb-march.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X