హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీలు, మీడియా...దుష్ప్రచారాన్ని ఆపండి... హోంమంత్రి మహమూద్ ఆలీ

|
Google Oneindia TeluguNews

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు పలు విమర్శలను ఎదుర్కొంటుంది. దీంతో పాటు భాదితురాలి కుటంబాన్ని పరామర్శించిన హోంమంత్రి మహమూద్ ఆలీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ సైతం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించకపోవడం కూడ పలు విమర్శలరే తావిస్తుంది. ఈ నేపథ్యంలోనే హొంమంత్రి మహమూద్ ఆలీ ప్రియాంక హత్యోదంతంపై మరోసారి స్పందించారు.

రోహింగ్యాలు ఇక్కడే ఉన్నారా?: కిషన్ రెడ్డికి మహమూద్ అలీ కౌంటర్రోహింగ్యాలు ఇక్కడే ఉన్నారా?: కిషన్ రెడ్డికి మహమూద్ అలీ కౌంటర్

 పోలీసుల తీరుపై నిరసనలు

పోలీసుల తీరుపై నిరసనలు

డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్యను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. సంఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిందని చెప్పారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు కావాలనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇక డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఉంటే పోలీసులు సరైన సమయంలో బాధితురాలి దగ్గరకు చేరుకునే వారని మరోసారి మంత్రి స్పష్టం చేశారు.

 అధికారులపై సస్పెన్షన్

అధికారులపై సస్పెన్షన్


మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్‌ చేశామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు ఇలాంటి అసత్య ప్రచారాన్ని మానుకోవాలని హోంమంత్రి సూచించారు. కాగా బాధితురాలు తన సోదరికి కాకుండా 100కు ఫోన్ చేసి ఉండాల్సిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పలు మహిళాసంఘాలు విద్యార్థినిలు హొంమంత్రి ప్రకటనపై విరుచుకుపడ్డారు. అయితే హోంమంత్రి చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి మరోసారి వాటిని ఉద్ఘటించారు.

సీఎం పరామర్శపై విమర్శలు

సీఎం పరామర్శపై విమర్శలు


దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కొంతమంది విదేశీయులు కూడ భారత్‌కు వెళితే ఇలాంటీ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయాందోళనలను వ్యక్తం అవుతున్న అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘటన జరిగిన తర్వాత పలువురు రాజకీయ నాయకులు, ప్రియాంక రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. మరోవైపు అత్యున్నత పదవిలో ఉన్న గవర్నర్‌తో పాటు, జాతీయ మహిళ కమీషన్ సైతం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. కాని సీఎం కేసీఆర్ కనీసం కుటుంబసభ్యులను పరామర్శించకపోవడంపై పలు విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరుపున ప్రియాంక రెడ్డి హత్యను ఖండించాలని స్పష్టం చేశారు.

English summary
Government has condemned of priyanka reddy murder said Telangana Home Minister Mohd Mahmood Ali. some political parties and media institutions are blaming government he added
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X