హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు... భార్యాభర్తలే నిర్వాహకులు...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో ఓ వ్యభిచార ముఠా గుట్టరట్టయింది. పక్కా సమాచారంతో పాతబస్తీలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిర్వాహకులు,విటులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.... పాతబస్తీలోని కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నవాబ్ సాబ్ కుంట బషారత్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కొద్దిరోజులుగా ఆ ఇంటిపై నిఘా పెట్టిన పోలీసులు గురువారం(సెప్టెంబర్ 17) ఆకస్మిక దాడి చేశారు.

prostitution racket busted in a house and 10 held in hyderabad

ఈ దాడిలో ఇద్దరు నిర్వహకులతో పాటు, ఒక విటుడు, ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో రూ.32వేలు నగదు,3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను భార్యాభర్తలుగా గుర్తించారు. వీరిద్దరే కొంతకాలంగా ఇక్కడ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు నిర్దారించారు. బాధిత యువతుల్లో నలుగురు పాతబస్తీకి చెందినవారు కాగా ఇద్దరు పశ్చిమ బెంగాల్,ఒకరు కర్ణాటకకు చెందినవారిగా గుర్తించారు. నిర్వాహకులతో పాటు విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గత నెలలో సుల్తాన్ బజార్ ప్రాంతంలోని ఓ లాడ్జిలోనూ సెక్స్ రాకెట్‌ను పోలీసులు బయటపెట్టిన సంగతి తెలిసిందే. సెక్స్ వర్కర్లను గుట్టుచప్పుడు కాకుండా లాడ్జికి తీసుకొచ్చి అక్కడ వ్యభిచార దందా నడుపుతున్నట్లు గుర్తించారు.లాడ్జి యాజమానితో పాటు సెక్స్ వర్కర్లు, విటులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గత నెలలో జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌లోనూ ఓ లాడ్జిలో వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నలుగురు విటులతో పాటు నలుగురు మహిళలు,ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. మహిళల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నట్లు గుర్తించారు.

English summary
A prostitution racket was busted in a lodge on Thursday in old city in Hyderabad.Police arrested 10 persons and filed cases against them. Total seven women were identified there,in them two belongs to Bengal,one is from Karnataka,remaining were Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X