హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో వ్యభిచార దందా బట్టబయలు... అపార్ట్‌మెంటులో గుట్టుచప్పుడు కాకుండా...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంటులో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో శనివారం(మార్చి 6) ఆ అపార్ట్‌మెంటుపై దాడి చేసి వ్యభిచార నిర్వాహకుడితో పాటు విటులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెల్తే... కూకట్‌పల్లి పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో ఉన్న ఒక అపార్ట్‌మెంటులో చరణ్ రాజు అనే వ్యక్తి ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఈ ఫ్లాట్‌కు తరుచూ ఇద్దరు యువతులు వచ్చి వెళ్తుండేవారు. చరణ్ స్నేహితులమని రోజూ ఎవరెవరో వచ్చి వెళ్తుండేవారు. దీంతో చరణ్ రాజుపై అనుమానంతో స్థానికులు పోలీసులకు సమచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం ఆ అపార్ట్‌మెంటులోని చరణ్ రాజు ఫ్లాట్‌పై దాడులు జరిపారు.

 prostitution racket busted in kukatpally hyderabad

ఈ సందర్భంగా చరణ్‌రాజుతో పాటు ఇద్దరు విటులు,ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3వేల నగదు,సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గతంలోనూ కూకట్‌పల్లి ప్రాంతంలో పోలీసులు వ్యభిచార ముఠాల గుట్టు రట్టు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్ నం.1లో స్పా ముసుగులో సాగిస్తున్న సెక్స్‌రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు. స్పా నిర్వాహకుడు ఆరిపాక కృష్ణ(23)తో పాటు కొంతమంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా విటులను ఆకర్షించి స్పా సెంటర్‌నే వ్యభిచార కేంద్రంగా మార్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఏడాది జనవరిలో ఖైరతాబాద్ పరిధిలోని చింతల్ బస్తీలోనూ ఓ వ్యభిచార ముఠా దందా బట్టబయలైంది.ఫిజియో థెరపీ పేరుతో మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తూ.. అందులో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులు నలుగురు విటులు,ఇద్దరు యువతులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

English summary
A prostitution gang was formed in Hyderabad. Police have uncovered a prostitution den in an apartment in Kookatpalli. Vitula was arrested along with the prostitution operator after raiding the apartment on Saturday (March 6) with false information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X