• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వాన్ని చంపేదాకా అన్నం మెతుకు ముట్టను... అవంతి తల్లి శపథం... హేమంత్ హత్యపై వెలుగులోకి సంచలన విషయం...

|

హైదరాబాద్‌లో చోటు చేసుకున్న హేమంత్ పరువు హత్యపై అతని భార్య,కుటుంబం న్యాయం కోసం పోరాడుతున్నారు. గతంలో మంథని మధుకర్,భువనగిరి నరేష్,జమ్మికుంట రాజేష్,మిర్యాలగూడ ప్రణయ్... ఇలా ఎంతోమంది కులాంతర వివాహాలు చేసుకుని బలైపోగా... హేమంత్ హత్యనే ఇక చివరిది కావాలని అంటున్నారు. హేమంత్‌ను హత్య చేసినవారికి కఠిన శిక్ష విధించాలని... అంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. తాజాగా చందానగర్‌లోని తమ నివాసం ఎదుట హేమంత్ కుటుంబ సభ్యులు,స్నేహితులు,సన్నిహితులు నిరసనకు దిగారు.

వి వాంట్ జస్టిస్... చందానగర్‌లో నిరసన...

వి వాంట్ జస్టిస్... చందానగర్‌లో నిరసన...

హేమంత్ హత్యకు నిరసనగా 'వి వాంట్ జస్టిస్' ప్లకార్డులు,పోస్టర్లతో అతని కుటుంబం,స్నేహితులు నిరసనకు దిగారు. భవిష్యత్తులో ఇంకెవరైనా పరువు హత్యలకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు ఉంటాయని తెలిసొచ్చేలా హేమంత్ హత్య నిందితులకు శిక్ష పడాలని అవంతి పేర్కొన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్,ఇప్పుడు హేమంత్... ఇవి మాత్రమే కాదని,బయటకు రాని కుల హత్యలు ఎన్నో ఉన్నాయన్నారు. అమృత లాగా,తన లాగా మిగతా బాధితులు తెర పైకి రాలేకపోయారని చెప్పారు. ఇలాంటి అన్యాయం జరిగిన ప్రతీ ఒక్కరి తరుపున ఇప్పుడు తాను పోరాడుతున్నానని... అత్యాచారాల నిరోధానికి ప్రత్యేక చట్టాలు తెచ్చినట్లే... కుల హత్యలకు కూడా ప్రత్యేక చట్టాలు అవసరమని డిమాండ్ చేశారు.

నిందితులను వదిలిపెట్టవద్దన్న అవంతి...

నిందితులను వదిలిపెట్టవద్దన్న అవంతి...

కులోన్మాదంతో హత్య చేసి లోపలికి వెళ్లినవాళ్లకు బయటకు వస్తామన్న ధీమా లేకుండా చేయాలన్నారు. నిందితులను అంత సులువుగా వదిలిపెట్టవద్దని... వారికి జీవిత ఖైదు విధించాలని అవంతి డిమాండ్ చేశారు. హేమంత్ సోదరుడు సుమంత్ మాట్లాడుతూ.. వాన్ని(హేమంత్) చంపితేనే మన కూతురు మన వద్దకు వచ్చి మనం చెప్పిన సంబంధం చేసుకుంటుందని అవంతి తల్లి ఇంట్లో వాళ్లతో చెప్పినట్లు తెలిపారు. అంతేకాదు,ఒకవేళ అవంతి చనిపోతే దాని శవానికైనా తాళి కట్టిస్తానని చెప్పిందన్నారు. గతంలో అమృత,మాధవి లాంటి అమ్మాయిలకు ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరగలేదని... కనీసం ఇప్పుడైనా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

హత్యలు చేసేవాళ్లకు గుణపాఠం ఏది...

హత్యలు చేసేవాళ్లకు గుణపాఠం ఏది...

పోలీసుల నుంచి ఇప్పుడు అందుతున్న సహకారం ఇకముందు కూడా కొనసాగాలని సుమంత్ అన్నారు. హేమంత్ స్నేహితులు మాట్లాడుతూ... వేరే కులం వాళ్లను ప్రేమిస్తే చంపుతామన్న సందేశాన్ని కొంతమంది సమాజంలోకి పంపిస్తున్నారని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వం మాత్రం వారికి తగిని గుణపాఠం చెప్పే సందేశాన్ని ఎందుకు పంపించట్లేదని ప్రశ్నించారు. కన్న బిడ్డ భర్తను చంపేయడం ప్రేమ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఒకరి జీవితాన్ని బలి తీసుకునే హక్కు ఎవరికి లేదన్నారు. హేమంత్ ఇంటి నుంచి నిరసనకారులు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

అవంతి తల్లి శపథం...

అవంతి తల్లి శపథం...

ఈ కేసుకు సంబంధించి అవంతి ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ... హేమంత్‌ను చంపేంతవరకూ తన తల్లి అన్నం తినని తండ్రి లక్ష్మారెడ్డితో చెప్పినట్లు తెలిపారు. అమ్మ పంతం,నాన్న ఆర్థిక సహకారం,మేనమామ సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేయడంతో హత్య జరిగిందన్నారు. ఒక తల్లి ఇంత కిరాతకంగా ఆలోచిస్తుందని ఊహించలేదన్నారు. తనకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకున్నారు.మరోవైపు గచ్చిబౌలి పోలీసులు ఈ కేసును పరువు హత్యగా నిర్దారించారు. హేమంత్‌ను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి,తండ్రి లక్ష్మారెడ్డి అంగీకరించారు. నిజానికి హేమంత్‌ ఒంటరిగా దొరక్కపోవడంతోనే... ఇలా ఇంటికెళ్లి మరీ కిడ్నాప్ చేసినట్లు నిర్దారించారు. లక్ష్మారెడ్డి తన ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అవంతిని ఆర్నెళ్లు ఇంట్లో నిర్బంధించినట్లు గుర్తించారు.

English summary
Hemanth family members and his friends staged a protest infront of his house in Chandanagar,Hyderabad,against to honour killing.They demand for justice and said accused should be punished severly.Hemanth was brutally murdered for marrying Avanthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X