హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్రిక్తత: బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడి, రేవంత్ రెడ్డి అరెస్ట్, కేసీఆర్‌కు లేఖ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల యూపీ పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నగరంలో నిరసనలకు దిగారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

రేవంత్ రెడ్డి అరెస్ట్..

రేవంత్ రెడ్డి అరెస్ట్..

కాంగ్రెస్ నేతల రాకపై సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్‌పై బీజేపీ కార్యకర్తల దాడికి యత్నించారు.

గాంధీభవన్ వైపు బీజేపీ శ్రేణులు..

గాంధీభవన్ వైపు బీజేపీ శ్రేణులు..


ఇది ఇలావుంటే, కాంగ్రెస్ పార్టీ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహించగా.. ఆ పార్టీ కార్యకర్తలు గాంధీ‌భవన్ వైపు దూసుకెళ్లారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో రెండు పార్టీల కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సరిదిద్దారు. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్‌లో హత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్ గాంధీని యూపీ పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Recommended Video

Hyderabad-Bengaluru Industrial Corridor To Connect AP ఏపీలోని ప్రాంతాలకు కూడా సముచిత స్ధానం...!!
ఏపీ సర్కారు కీలక వ్యక్తులతో కాంట్రాక్టులెందుకు కేసీఆర్?

ఏపీ సర్కారు కీలక వ్యక్తులతో కాంట్రాక్టులెందుకు కేసీఆర్?

ఇది ఇలావుండగా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్పించాలని లేఖలో కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన.. కొడంగల్ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని, కేఆర్ఎంబీ తన లేఖకు స్పందనగా ప్రత్యుత్తరం ఇచ్చిందని పేర్కొన్నారు. ఏపీ కయ్యానికి కాలు దువ్వుతోందంటోన్న మీకు ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యమెందుకు? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

English summary
protest: revanth reddy arrested in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X