Snapchat: నీకు కాబోయే భార్య ఇంటి పక్కనే ఉంటానంటూ వలపువల -పెళ్లికి నో చెప్పడంతో ప్రతీకారం
కరోనా విలయ కాలంలోనూ కంత్రీగాళ్లు రెచ్చిపోతున్నారు. లాక్ డౌన్ అమలులో బిజీగా ఉన్నప్పటికీ, ఎప్పటిలాగే కంత్రీగాళ్లకు అడ్డుకట్టవేస్తూ పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారు. సున్నితమైన కేసులకు కచ్చితమైన పరిష్కారాలిస్తున్నారు రాచకొండ పోలీసులు. ఆన్లైన్ పరిచయం అయిన యువతి ప్రేమను అంగీకరించలేదని.. ఆమె పెళ్లి చెడగొట్టాలని చూసిన ఓ యువకుడ్ని రాచకొండ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాలివి..
షాకింగ్:
సిలికాన్
వ్యాలీలో
మారణకాండ
-తోటి
ఉద్యోగుల్ని
కాల్చేసిన
దుండగుడు
-మొత్తం
9
మరణాలు

స్నాప్‌చాట్‌లో దగ్గరై..
నాగర్‌కర్నూల్ జిల్లా తాండూరుకు చెందిన వంగ శివకుమార్ అలియాస్ నాని.. రెస్టారెంట్ ఓనర్. అతనికి స్నాప్‌చాట్‌లో ఒక యువతి ప్రొఫైల్ కనిపించింది. ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి రోజు ఆన్లైన్లో చాటింగ్‌లు చేసుకునేవారు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకొని ప్రతీరోజు మాట్లాడుకునేవారు. ఈక్రమంలో వారు బాగా దగ్గరయ్యారు..

ఉప్పల్‌లో కలయిక ఫోటోలు..
స్నాప్ చాట్ లో పరిచయం అయిన యువతితో స్నేహం పెరగడంతో శివకుమార్ ఆమెను నేరుగా చూడటానికి హైదరాబాద్ వచ్చాడు. ఉప్పల్‌లోని వాళ్లిద్దరూ కలుసుకున్నారు. తమ స్నేహానికి గుర్తుగా ఫొటోలు దిగారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత శివకుమార్ ఆమెకు ఫోన్ చేసి నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడు. అందుకు నో చెప్పిన యువతి... అప్పటికే తనకు పెళ్లికుదిరిందని చెప్పింది. అంతటి ఆగకుండా.. శివకుమార్ ను నమ్మించే క్రమంలో ఆ యువతి తనకు కాబోయే భర్త ఫొటోను, ఫోన్ నంబర్‌ను పంపింది.
visakhapatnam:
మరో
ప్రమాదం
-APEPDCL
సింహాచలం
సబ్‌స్టేషన్‌లో
పేలుడు
-తప్పిన
ముప్పు

నీకు కాబోయే భార్యకు బాయ్ ఫ్రెండ్..
ఫోన్ నంబర్లు ఇవ్వడాన్ని ఒక అవకాశంగా భావించిన శివ.. ఎలాగైనా ఆమె పెళ్లి చెడగొట్టాలనుకున్నాడు. యువతికి కాబోయే భర్తతో యువతిగా పరిచయం చేసుకుని వాట్సాప్ చాటింగ్‌లు చేసేవాడు. ''నీకు కాబోయే భార్య ఇంటి పక్కన ఉంటానని, మీరంటే నాకు ఇష్టం'' అంటూ మెసేజ్‌లు పెట్టేవాడు. నీకు కాబోయే భార్యకు బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతడితో ఆమె దిగిన ఫొటోలు నా వద్ద ఉన్నాయంటూ వాటిని షేర్ చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.