హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేగా రఘునందన్ అసెంబ్లీలో .. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం

|
Google Oneindia TeluguNews

దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ తో పోరాడి విజయం సాధించిన బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈరోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ను తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రఘునందన్ రావు మాత్రమే కాకుండా గవర్నర్ కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య లు నేడు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఎమ్మెల్సీలుగా ఉన్న రాములు నాయక్, కర్నే ప్రభాకర్, దివంగత నాయని నర్సింహారెడ్డి ల పదవీకాలం పూర్తి కావడంతో ఆస్థానాలలో ఈ ముగ్గురిని భర్తీ చేశారు సీఎం కేసీఆర్ . గత ఆగస్టు నాటి నుండి మండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ గానే ఉన్నాయి. తాజాగా ఈ స్థానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గోరటి వెంకన్న , బొగ్గారపు దయానంద్ , బస్వరాజు సారయ్యని ఎంపిక చేశారు.

Raghunandan as an MLA in Assembly .. Three MLCs in the Legislative Council are sworn in

ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు వీరంతా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు . ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు హాజరై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీలుగా తమకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతామని పేర్కొన్నారు.

English summary
BJP MLA Raghunandan Rao, who won with the ruling TRS in Dubbakka, was today sworn in as a legislator. He has been sworn in as Telangana MLA by telangana speaker Pocharam Srinivas Reddy. Not only Raghunandan Rao but also newly elected MLCs Gorati Venkanna, Boggarapu Dayanand and Baswaraju Saraiah were sworn in in the Legislative Council today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X