వద్దంటే వాన.. మరో 3 రోజులు, తేలికపాటి జల్లులు.. తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాలకు వర్షాలు, ఈదురుగాలులు తప్పడం లేదు. గాలులు వల్ల జనం ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. తర్వాత వానతో ప్రాబ్లమ్స్ తప్పలేదు. వచ్చే మూడురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి వీస్తున్న శీతలగాలుల ప్రభావం వలన ఇవాళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదారాబాద్లోని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయిని చెప్పారు.

ఉత్తర, కోస్తాంధ్ర
మరో వైపు ఆంధ్రప్రదేశ్ లోకి ఈశాన్య, తూర్పుగాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఉత్తర, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్లు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు,ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తేలికపాటి జల్లులు
దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి,రెండు చోట్ల సంభవించవచ్చని అధికారులు తెలిపారు. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

మోస్తరు వాన
ఇక రాయలసీమలో చూస్తే ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉందని అమరావతిలోనివాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.

మంచుదుప్పటి
మరో వైపు ఉత్తరభారతాన్ని మంచుదుప్పటి కమ్మేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ హిమపాతం నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి వాతావరణం ఉంది. చలిగాలులు వీయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆస్తమా ఉన్నవారు అయితే ఇంటి నుంచి బయటకు రావడం లేదు. చలిగాలుల తర్వాత కాసేపు ఎండ వచ్చిన జనం సంతోష పడుతున్నారు. కానీ ఆ వెంటనే మబ్బులు వచ్చి.. చల్లని వాతావరణం ఉంది. దీంతో ఊసురుమనడం వారి వంతవుతుంది.