హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో వర్షం : జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు వస్తోండటంతో భాగ్యనగరంలో తొలకరి పులకరించింది. సోమవారం సాయంత్రం సిటీలో వర్షం కురిసింది. దీంతో ఎండ వేడితో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఊపశమనం కలిగింది. చిన్న వర్షానికే జలమయమయ్యే రోడ్లన్నీ ఎప్పటిలాగే నీటితో నిండిపోయాయి.

ఈదురుగాలులు .. వర్షం ...
హిమాయత్ నగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, మియాపూర్, మల్కాజ్ గిరి, కుషాయిగూడలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నిండిపోయాయి. కొందరు ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షంతో ట్రాఫిక్ కు వాహనదారులు తిప్పలుపడ్డారు. మరోవైపు ఈదురుగాలులు వీయడంతో భారీ హోర్డింగులు కూలిపోతాయేమోనని ఆందోళన పడ్డారు స్థానికులు.

rain in hyderabad

కొన్నిచోట్ల ఫ్లెక్సీలు చినిగిపోగా .. మరికొన్ని చోట్ల హోర్డింగులు కూలిపోయాయి. అయితే జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. కమిషనర్ దానకిశోర్ అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మళ్లీ వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని స్పష్టంచేశారు.

English summary
This is a little bit of relief for people who are sunny with heat. All the roads that flow into the small rainfall are filled with water as usual.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X