నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం.. రెండు రోజుల్లో డిశ్చార్జ్: అపోలో వైద్యులు
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని అపోలో వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రకటించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తోందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. అలాగే రజనీకాంత్‌కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు స్పష్టంచేశారు.
రజనీకాంత్‌కు అస్వస్థత.. అనారోగ్యంతో అపోలోలో చేరిక.. ఫ్యాన్స్ ఆందోళన

బీపీ పెరగడంతో..
నాలుగు రోజులుగా రజినీకాంత్ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. రజనీకాంత్‌కు బీపీ పెరగడంతో చిత్ర యూనిట్ ఆస్పత్రికి షిఫ్ట్ చేసిందని తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. ప్రముఖులు, అభిమానులు ఆస్పత్రికి రావొద్దని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి చేశారు. కానీ అభిమానులు మాత్రం భారీగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇటు ప్రముఖులు కూడా ఆస్పత్రికి వస్తున్నారు.

అస్వస్థత.. ఆస్పత్రికి షిప్ట్..
శుక్రవారం ఉదయం రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరగా.. రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతోపాటు కుమార్తె ఐశ్వర్య ఆస్పత్రిలో ఉన్నారు. కరోనా పరీక్షలో రజనీకాంత్‌కు నెగిటివ్ వచ్చింది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే సినిమా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది.

కరోనా వల్ల షూటింగ్ రద్దు
రెండు రోజుల క్రితం కరోనా వల్ల షూటింగ్‌ను వాయిదా వేశారు. షూటింగ్లో పాల్గొంటున్న ప్రొడక్షన్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపేశారు. ఆ సమయంలో రజనీకి కూడా కరోనా పరీక్ష చేయగా నెగటివ్ వచ్చింది. ఇవాళ మరోసారి పరీక్ష చేయగా కూడా నెగటివ్ వచ్చింది. అన్నాత్తై మూవికి శివ దర్శకత్వం వహిస్తోండగా.. సన్ పిక్చర్స్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది.

రాజకీయల్లోకి రజనీ..?
రాజకీయ పార్టీ పెడతానని రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో.. రజనీ పార్టీ పెడితే.. అన్నాడీఎంకే, డీఎంకే కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కమల్ హాసన్ కూడా కలిసి పనిచేద్దామని కోరిన సంగతి తెలిసిందే. ఇంతలో రజనీకాంత్ అనారోగ్యానికి గురవడంతో ఫ్యాన్స్ టెన్షన్‌కు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ మేరకు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు తెలిపారు.