హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈద్ ముబారక్... ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన రంజాన్ వేడుకలు

|
Google Oneindia TeluguNews

ముస్లింలు సోదరుల రంజాన్ ఉపవాసాలు మంగళవారంతో ముగిశాయి .నెలవంక కనిపించినట్టు ఇమామ్‌లు ప్రకటించడంతో రంజాన్ వేడుకలు ప్రపంచవ్వాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి...ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్ర్రాల్లో పలువురు మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా పలు మసీదుల వద్ద ప్రార్ధనలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుండంతో... మతంతో సంబంధం లేకుండా ముస్లింలు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

మత సామరస్యాన్ని పెంపోందించే రంజాన్

మత సామరస్యాన్ని పెంపోందించే రంజాన్

మత సామరస్యాన్ని, ఆత్మీయతను, సుహృద్భావాన్ని చాటే అపురూపమైన పండుగ రంజాన్. హిందూ, ముస్లింల మధ్య ఉన్న సోదర భావాన్ని పెంపొందించే పండగ . రంజాన్ పండుగ ప్రతి ఒక్క ముస్లిం కుటుంభంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. రంజాన్ రోజు ముస్లిం సోదరులు బిర్యానీ తిని, సేమ్యా ఖీర్ తాగుతూ పండగను జరుపుకుంటారు, కాగా భిన్న మతాలకు, విభిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ లో కూడ పలువురు హిందువులు కూడ ఆయా ముస్లిం సోదరుల ఇండ్లలోకి వెళ్లి మత సామరస్యాన్ని పెంపోందించే విధంగా వారికి రంజాన్ శుభాకాంక్షాలు తెలిపారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు ముస్లీంలకు రంజాన్ పండగ శుభాకాంక్షాలు తెలిపారు.

అధికారికంగా పండగలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

అధికారికంగా పండగలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గత ఐదేళ్లుగా బోనాలు, బతుకమ్మ, గణేష్ జయంతి, రంజాన్, క్రిస్ మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం...ఈ ఏడాది కూడా రంజాన్ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహిస్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఈద్గాలు, మసీదుల వద్ద పూర్తిస్థాయి సదుపాయాలను కల్పించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇక చాల రోజుల తర్వాత ఏపిలో ముస్లీంలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన విషయం తెలిసిందే..

ఉన్న దాంట్లో దానం చేయాలని చెబుతున్న ఖురాన్

ఉన్న దాంట్లో దానం చేయాలని చెబుతున్న ఖురాన్

రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం తనకున్న కొద్దిపాటి సంపాదనలో కొద్ద గొప్పో దానం చేయాలని ఖురాన్ చెబుతుంది. దీంతో ఉన్నత కుటుంభాల్లో ఉన్న ముస్లింలు వారి స్థాయిలను బట్టి ఈరోజు బీద ముస్లింలతోపాటు ఇతర బీద ప్రజలకు పలు దానాలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ కూడ రంజాన్ కానుకలను ముస్లింలకు అందించింది కాగా రెండు తెలుగు రాష్ట్ర్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు మసీదులు ముస్లీం ప్రార్థనలతో కళకళ లాడుతున్నాయి.

English summary
Ramzan celebrations have begun with great enthusiasm ... the celebrations are taking place in the country. along with Hyderabad, and many other mosques in the Telugu state are doing special prayers at Eidgala. And so on Officials arranged for prayers at mosques. people are sharing their happiness by sharing sweets with everyone
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X