హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏసీబీ కస్టడీకి నోట్ల కట్టల ఎమ్మార్వో.. ఆదాయానికి మించిన ఆస్తుల యవ్వారం..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వో లావణ్య ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఏసీబీ సోదాల్లో 93 లక్షల రూపాయలు బయటపడ్డాయి. ఆ క్రమంలో రిమాండ్ నిమిత్తం ఆమె చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే ఆమెను మరింత విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు.

ఏసీబీ అధికారుల వినతి మేరకు ఏసీబీ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది. ఆ మేరకు ఎమ్మార్వో లావణ్యను రెండు రోజుల కస్టడీకి తీసుకోనున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అధికారులు లావణ్యను విచారించనున్నారు. ఏసీబీ అధికారులు లావణ్యను శుక్రవారం నాడు కస్టడీకి తీసుకోనున్నారు.

 rangareddy district keshampet mro lavanya into acb custody

హోంమినిస్టర్‌ మనవడా మజాకా.. డీజీపీ కారుపైనే టిక్కుటాక్కు..!హోంమినిస్టర్‌ మనవడా మజాకా.. డీజీపీ కారుపైనే టిక్కుటాక్కు..!

ఓ రైతు దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కొందుర్గు వీఆర్‌ఓ అనంతయ్య ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డారు. అయితే ఆయన ఇచ్చిన సమాచారంతో దాని వెనుక ఎమ్మార్వో లావణ్య పాత్ర ఉందని ఆధారాలు సేకరించారు ఏసీబీ అధికారులు. ఆ మేరకు హిమాయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు.

ఏసీబీ అధికారుల సోదాల్లో 93 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్‌ చేశారు. రెండేళ్ల కిందట ఉత్తమ తహశీల్దార్ అవార్డు అందుకున్న లావణ్య.. ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్‌ కావడం గమనార్హం.

English summary
Rangareddy District Keshampet MRO Lavanya taken into ACB Custody for two days. She arrested in bribe case while caught 93 lakh rupees in her home. Now, she was in chanchalguda jail. Friday, she went to ACB custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X