• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రేపిస్ట్ రాజు చావు మంచిదే: నా బిడ్డ కూడా నరకయాతన, అత్త యాదమ్మ హర్షం

|

సైదాబాద్ హ‌త్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అత‌డికి రెండేళ్ల‌ క్రితమే సూర్యాపేట జిల్లా జ‌లాల్‌పురం గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయితో పెళ్లి జ‌రిగింది. ఆమె పేరునే రెండు చేతుల‌పై రాజు ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు. ఒక చేతిపై మౌనిక పేరు ఇంగ్లిష్‌లో, మ‌రో చేతిపై తెలుగులో రాయించుకున్నాడు. రాజు భార్య ప్ర‌స‌వం కోసం ఏడాది క్రితం జ‌లాల్‌పురం వ‌చ్చి అక్క‌డే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజు అత్తింటి వారిని కూడా వేధించేవాడ‌ని తెలిసింది. రెండు వారాల క్రితమే జ‌లాల్‌పురం వెళ్లి మ‌ద్యం మ‌త్తులో త‌న అత్త‌పై దాడి చేశాడు.

అత్త హర్షం..

అత్త హర్షం..

ఇప్పుడు రాజు ఆత్మహత్యతో అతడి అత్త యాదమ్మ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేసింది. తన కుమార్తె మౌనిక జీవితాన్ని రాజు నాశనం చేశాడని, ఇప్పుడు మరో బాలిక‌ జీవితాన్ని కూడా నాశనం చేశాడని వాపోయింది. త‌న అల్లుడు రాజుకు బతికే హక్కులేదని, అత‌డు ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడని ఆమె కామెంట్ చేసింది. తన కుమార్తె మౌనిక‌కు రాజు వ‌ల్ల వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడద‌ని ఆమె తెలిపింది. 15 రోజుల క్రితం రాజు జలాల్‌పురంలోని తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో గొడ‌వ‌ప‌డి రాజు తన గొంతు నొక్కబోతే తన కుమారుడు వచ్చి అడ్డుకున్నాడని యాద‌మ్మ తెలిపింది. అప్పుడు త‌మ గ్రామం నుంచి వెళ్లిన రాజు మ‌ళ్లీ రాలేద‌ని చెప్పింది. రాజు హైదరాబాద్‌కు మకాం మార్చడానికి ముందు ఏడాది క్రితం సూర్యాపేటలో నివాసం ఉండేవాడు.

రైల్వే కీ మెన్లు

రైల్వే కీ మెన్లు

రాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు ఇద్దరు రైల్వే కీమెన్లు పూర్తి వివరాలను తెలియజేశారు.ఇద్దరం ఉదయాన్నే డ్యూటీకి ఎక్కామని వారు వివరించారు, ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి పొదల్లోకి పారిపోయాడని వారు చెప్పారు. అనుమానం వచ్చి చెట్లలోకి వెళ్లి చూడగా అతను కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత తామిద్దరం ఒక 200 మీటర్ల దూరం వరకు ట్రాక్ పై నడుచకుంటూ వచ్చామని, ఆ సమయంలో హైదారాబాద్ వైపుగా వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
ఇప్పుడు రాజు ఆత్మహత్యతో అతడి అత్త యాదమ్మ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేసింది. తన కుమార్తె మౌనిక జీవితాన్ని రాజు నాశనం చేశాడని, ఇప్పుడు మరో బాలిక‌ జీవితాన్ని కూడా నాశనం చేశాడని వాపోయింది. త‌న అల్లుడు రాజుకు బతికే హక్కులేదని, అత‌డు ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడని ఆమె కామెంట్ చేసింది. తన కుమార్తె మౌనిక‌కు రాజు వ‌ల్ల వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడద‌ని ఆమె తెలిపింది. 15 రోజుల క్రితం రాజు జలాల్‌పురంలోని తమ ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో గొడ‌వ‌ప‌డి రాజు తన గొంతు నొక్కబోతే తన కుమారుడు వచ్చి అడ్డుకున్నాడని యాద‌మ్మ తెలిపింది. అప్పుడు త‌మ గ్రామం నుంచి వెళ్లిన రాజు మ‌ళ్లీ రాలేద‌ని చెప్పింది. రాజు హైదరాబాద్‌కు మకాం మార్చడానికి ముందు ఏడాది క్రితం సూర్యాపేటలో నివాసం ఉండేవాడు.

  కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి రాజు ఆత్మ‌హ‌త్య..! || Oneindia Telugu
  అతనే అని

  అతనే అని

  ఆ తర్వాత వెళ్లి పరిశీలించగా రాజు అనే అనుమానం తమకు వచ్చిందని వివరించారు. ఆ వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందజేశామని తెలిపారు. ఉదయం 8.40 గంటలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. రాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతని డెడ్ బాడీని కుటుంబసభ్యులు కూడా ధృవీకరించారు. చేతిపై మౌనిక అనే పేరు కూడా ఉంది. చిన్నారి చనిపోయిన ఏడు రోజులకు కీచక నీచుడు రాజుకు కూడా అదేవిధంగా శిక్షపడింది. తనకుతానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.

  English summary
  Rapist raju suicide is very happy his aunty yadamma said. her daughter mounika also face tourcher said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X