హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1వ తేదీ నుంచి ఓటీపీ ద్వారా రేషన్.. ఐరీష్ విధానం ద్వారా కూడా..

|
Google Oneindia TeluguNews

ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. బయోమెట్రిక్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. ఐరీష్ కూడా యూజ్ చేస్తోంది. ఇందులో కూడా కనుపాపలు సరిగా కనిపించడం లేదు. దీంతో ఓటీపీ ద్వారా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీనిని వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలు చేయబోతోంది.

లబ్ది దారులు తమ ఫోన్ నంబర్ ఆధార్ కార్డులో నమోదు చేసుకోవాలని పొరసరఫరాల శాఖ కోరుతోంది. రేషన్ షాపుల్లో ఉన్న బయో మెట్రిక్ ఈ పాస్ యంత్రంలో ఇప్పటివరకు లబ్దిదారులు, తమ వేలు ముద్రలు వేసి సరకులు పొందేవారు. కరోనా వల్ల గత సంవత్సరం కొన్ని నెలలు థర్డ్ పార్టీ అనుమతితో , స్వచ్ఛంద సేవకులు అందించిన సాయంతో ప్రజా పంపిణీ జరిగింది.

ration will be give otp in the state..

లబ్ది దారుల ఫోన్ నంబర్ ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలని, తద్వారా సరకులు పొందే సమయం లో ఈ పాస్ యంత్రం నుంచి ఫోన్ కు వన్ టైం పాస్ వర్డ్ వచ్చాక ,దాన్ని బయో మెట్రిక్ యంత్రంలో నమోదు చేసి రేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కనుపాప ఐరిస్ను నమోదు చేసే ప్రత్యామ్నాయ పద్దతి ద్వారా కూడా రేషన్ పొందే వీలుంది. ఈ విధానం అమలు వల్ల బయో మెట్రిక్ పై వేలు ముద్రలు నివారించడానికి సాధ్యమవుతుందన్నారు. ఈ కొత్త పద్దతి వల్ల ప్రజా పంపిణీలో మరింత పారదర్శకతతోపాటు రేషన్ అక్రమాలకు చెక్ పెట్టే అవకాశం కలుగుతుంది.

ప్రజలు ఆహార భద్రతా కార్డు ఉన్న వారు తమ ఫోన్ కి వచ్చే ఓ టీ పీ సంఖ్యను నిర్ణీత సమయంలో రేషన్ షాపుకు సమర్పిస్తే, దాన్ని ఆధారంగానే రేషన్ ఇవ్వడం జరుగుతుంది. జనవరి 31 లోగా ప్రజలు తప్పనిసరిగా ఫోన్ నంబర్లను ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

English summary
ration will be give otp in the state civil supply department said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X