• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్ కల్చర్.. పల్లెలకు చేరిన రేవ్ పార్టీలు

|

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ విచ్చలవిడి సంస్కృతి పెరిగిపోతోంది. మందు, చిందుతో యువత రెచ్చిపోతోంది. రేవ్ పార్టీల పేరిట బ్యాడ్ కల్చర్ పంజా విసురుతోంది. మూడంకెల జీతాలు అందుకుంటూ.. వీకెండ్ లో రెండు రోజులు సరాదాగా గడుపుదామనుకునే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. మందేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మరచిపోయి.. అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో చాలామంది తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు.

రేవ్ పార్టీ కల్చర్ నగరాలకే పరిమితం అనుకుంటే పొరపాటు. పట్టణాలు దాటి పల్లెలకు చేరింది ఈ విష సంస్కృతి. గోవా, ముంబై లాంటి సముద్ర తీర ప్రాంతాలతో పోటీపడుతూ పల్లెల్లో రేవ్ పార్టీలు జోరందుకుంటున్నాయి. యువతే లక్ష్యంగా సాగుతున్న ఈ దరిద్రపుగొట్టు కల్చర్ తో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు నిర్వాహకులు.

పిట్టీ కేసుల్లో ప్రతాపం.. సైకో కేసులో ఫెయిల్యూర్?.. పోలీసులకు శీనుగాడి తిప్పలు..!

మందేయ్.. చిందేయ్.. రేవ్ పార్టీ జోరు..!

మందేయ్.. చిందేయ్.. రేవ్ పార్టీ జోరు..!

ఇదివరకు రేవ్ పార్టీ అంటే.. అబ్బో అది పెద్దోళ్లకు సంబంధించిన వ్యవహారం అనుకునేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు జీవనశైలి కూడా మారుతోంది. ఏదో ఎంజాయ్ చేయాలనే ఆరాటం యువతను ఒక్క దగ్గర నిల్చోనివ్వడం లేదు. దానికి తగ్గట్టుగా రెండు, మూడంకెల జీతం వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే మస్తీ మజా అనుకుంటూ లేనిపోని షోకులతో రేవ్ పార్టీ కల్చర్ కు అలవాటు పడుతున్నారు.

రాత్రంతా మందేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మరచిపోయి లేజర్ లైట్ల వెలుతురులో చిందేయడమే రేవ్ పార్టీ. ఒక్క మాటలో సూటిగా చెప్పాలంటే.. మందు, విందు, పొందు ఒకే దగ్గర లభించే వేదిక అన్నమాట. డీజే సౌండ్స్, అర్ధరాత్రి వరకు అర్ధనగ్నంగా కనిపించే అమ్మాయిలు ఆ తర్వాత సోయి లేకుండా బట్టలు విప్పేయడం.. అలా అలా శృంగార కార్యకలాపాలకు సిద్ధమవుతారు. అయితే రేవ్ పార్టీలకు వచ్చే అమ్మాయిలు అన్నింటికీ సిద్ధపడే వస్తారు. హుక్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకున్నాక.. వాళ్లు ఏం చేస్తున్నారో వారికే తెలియదు.

పల్లెలకు పాకిన విష సంస్కృతి

పల్లెలకు పాకిన విష సంస్కృతి

రేవ్ పార్టీ కల్చర్ ఆంధ్రప్రదేశ్ లోని పల్లెలకు సైతం చేరడం గమనార్హం. మొన్న కర్నూలు, నిన్న విశాఖపట్నం, తాజాగా పశ్చిమగోదావరి జిల్లా. ఇలా ఏపీలోని పల్లెలకు కూడా ఈ విష సంస్కృతి పాకింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ తరహాలో శుక్రవారం (10.05.2019) అర్ధరాత్రి జరిగిన అసభ్య నృత్యాల ఉదంతం కలకలం రేపింది. జిల్లాకు చెందని పారిశ్రామికవేత్త తన పుట్టిన రోజు సందర్భంగా.. మార్టేరులోని ఓ కల్యాణమండపంలో నిర్వహించిన ఈ తతంగం రాష్ట్రవ్యాప్తంగా హీటెక్కించింది.

విశాఖ జిల్లాలోని గాజువాక, అనకాపల్లికి చెందిన యువతులతో అసభ్య నృత్యాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీకి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు హాజరైనట్లుగా ప్రచారం జరిగింది. చివరకు విషయం కాస్తా పోలీసులకు చేరడంతో నలుగురు యువతులతో పాటు ఆ పారిశ్రామికవేత్తను, నిర్వాహకులను, కల్యాణ మండపం వాచ్ మెన్ ను అరెస్ట్ చేశారు.

 హైదరాబాద్ శివార్లలో రెచ్చిపోతున్న నిర్వాహకులు

హైదరాబాద్ శివార్లలో రెచ్చిపోతున్న నిర్వాహకులు

ఇక తెలంగాణలో రేవ్ పార్టీ కల్చర్ తంతు అంతా ఇంతా కాదు. హైదరాబాద్ కేంద్రంగా కొందరు నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. శివారు ప్రాంతాలైన చేవెళ్ల, మేడ్చల్, శంకర్ పల్లి, మొయినాబాద్, షాబాద్ ఏరియాల్లో రేవ్ పార్టీల కల్చర్ వీపరీతంగా పెరిగిపోయింది. ఆ పచ్చని పల్లె ప్రాంతాల్లో డీజేల హోరు కలకలం రేపుతోంది. నగరంలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటం.. డీజే సౌండ్స్ అంత భారీ స్థాయిలో అనుమతి లేకపోవడం కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల పల్లె ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. శివారు ప్రాంతాలైతే యువత కూడా పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతుండటం కొసమెరుపు.

ఉద్యోగం కావాలంటే న్యూడ్ ఫోటోలు పంపు.. యువతికి హెచ్ఆర్ పేరిట వేధింపులు

రిసార్టులు, ఫాంహౌస్‌లు.. కాదేదీ రేవ్ పార్టీకి అనర్హం

రిసార్టులు, ఫాంహౌస్‌లు.. కాదేదీ రేవ్ పార్టీకి అనర్హం

ఫ్యామిలీలతో సరదాగా గడిపేలా రీక్రియేషన్ క్లబ్ పేరిట వెలిసిన రిసార్టులు.. రేవ్ పార్టీల నిర్వాహకులకు కలిసొస్తున్నాయి. అంతేకాదు పెద్దోళ్లు విడిది కోసం శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న ఫాంహౌస్‌లు కూడా రేవ్ పార్టీలకు వేదికవుతున్నాయి. ఉద్యోగుల నుంచి మొదలు రాజకీయ, సినీ ప్రముఖుల దాకా ఈ కల్చర్ కు బాగా అలవాటుపడుతున్నారు. అంతేకాదు ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను అధికశాతం అమ్మే ఉద్యోగులకు రీఫ్రెష్ మెంట్ పేరిట ఇలాంటి పార్టీలు ఇవ్వడం గమనార్హం. ఇక పార్టీ రేంజ్ ను బట్టి డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు నిర్వాహకులు. ఇటీవలి కాలంలో ఖరీదైన కొకైన్, ఎల్ఎస్డీ డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా అందుబాటులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rave Party Bad Culture Exposed to Villages in Telugu States. Young People who attracted to these rave parties showing that cautious signal. Alcohol, drugs, dance, dj sound and woman nude dances attracting facts for youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more