హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓల్డ్ మలక్ పేటలో మొదలైన రీ పోలింగ్, సాయంత్రం ఎగ్జిట్ పోల్స్, మేయర్ పీఠం ఎవరికో..

|
Google Oneindia TeluguNews

ఓల్డ్ మలక్ పేట డివిజన్ పరిధిలో రీ పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ గుర్తులు తారుమారు కావడంతో 1వ తేదీన పోలింగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. 69 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఇక్కడ మొత్తం 54,655 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 27889, స్త్రీలు 26763, ఇతరులు 3 ఉన్నారు. 69 పోలింగ్ స్టేషన్ పరిధిలో 12 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు.

69 పోలింగ్ స్టేషన్లు..

69 పోలింగ్ స్టేషన్లు..

ఓల్డ్‌మలక్‌పేట్ 69 పోలింగ్ స్టేషన్ పరిధిలో సీపీఐ అభ్యర్ధి గుర్తు తారుమారైంది. దీనిపై సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ అభ్యర్థి ఎదురుగా సీపీఎం గుర్తును ముద్రించారు. బ్యాలెట్‌ పత్రంలో కంకి కొడవలికి బదులు సుత్తి కొడవలి రావడంతో పోలింగ్‌ నిలిపివేయాలంటూ సీపీఐ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎన్నికను ఎన్నికల సంఘం నిలిపివేసింది. గురువారం రీ పోలింగ్ నిర్వహిస్తోంది.

సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్..

సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్..

మరోవైపు గ్రేటర్ పోల్స్‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై 1వ తేదీన నిషేధం విధించారు. 3వ తేదీన రీ పోలింగ్ ఉన్నందున నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 3వ తేదీన రీ పోలింగ్ ఉంది. ఇందుకు అనుగుణంగా ఓల్డ్ మలక్ పేట రీ పోలింగ్ ఉండటంతో.. బ్యాన్ చేశారు. ఇవాళ సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించొద్దని ఎస్ఈసీ పార్థసారథి స్పష్టంచేశారు.

Recommended Video

GHMC Elections 2020 : ఖాళీగా Polling Centers.. ఓటింగ్ ను లైట్ తీసుకున్న గ్రేటర్ ఓటర్లు!
మరికొన్ని గంటల్లో ప్రజాతీర్పు..

మరికొన్ని గంటల్లో ప్రజాతీర్పు..

గ్రేటర్‌లో నువ్వా నేనా అన్నట్టు పార్టీల ప్రచారం జరిగింది. కానీ పోలింగ్ శాతం మాత్రం ఆందోళన కలిగించింది. ఇదీ పార్టీల విజయవాకాశాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. రేపు ఉదయం 8 గంటల నుంచి బల్దియా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. బ్యాలెట్ పత్రాలు లెక్కించాల్సి ఉన్నందున రాత్రి వరకు ఫలితం వెలువడే ఛాన్స్ ఉంది. గ్రేటర్‌లో అధికార పార్టీకి ఎక్స్ అఫిషియో సీట్లు ఎక్కువగా ఉండటం కలిసి వస్తోంది. మరీ ప్రజా తీర్పు ఎలా ఉండనుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.

English summary
re-polling start at old malakpet region today 7 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X