హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంప్రమైజ్ చాలా కాస్ట్లీ గురూ..! రె'బెల్స్" బేరసారాలతో అభ్యర్థులు బేజార్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం కొందరికి కాసుల వేటగా మారిందా? రె'బెల్స్' ఘంటికలు మోగిస్తూ జేబులు నింపుకొనే ప్రయత్నం జరుగుతోందా?
కిందమీద పడి టికెట్ తెచ్చుకున్న అభ్యర్థులకు తలనొప్పిగా మారిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తాజా పరిణామాలకు అద్దం పడుతున్నాయి. 'పైసా వసూల్' బేరాలు కొందరికి వరంలా మారుతున్నాయి. దీంతో కాంప్రమైజ్ చాలా కాస్ట్లీ గురూ అంటూ తలలు పట్టుకుంటున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.

ముందస్తు ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి టికెట్లు రావడం కొందరికి గగనంలా మారింది. ఎన్నో తిప్పలు పడితే గానీ టికెట్లు ఖరారు కాలేదు. కొందరైతే విచ్చలవిడిగా డబ్బులు ధారపోసి టికెట్లు కొనుక్కున్నారనే ఆరోపణలున్నాయి. అదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు ఎన్నికల ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. మరోవైపు రె'బెల్స్' బెడద కాస్ల్టీగా మారింది. పోటీ నుంచి తప్పుకోవాలంటే అడిగినంత ఇవ్వాల్సిందే. అందుకే 'రాజీ' మంత్రం లక్షలు దాటి కోట్లకు చేరింది. ఒకచోట ఊహించని రీతిలో 10 కోట్లకు పైగా అడిగినట్లు తెలుస్తోంది. చివరకు 2-3 కోట్లకు బేరం కుదిరిందట.

గంత కాదు.. గింత తీసుకో..!

గంత కాదు.. గింత తీసుకో..!

ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించిన కొందరికి నిరాశే ఎదురైంది. దీంతో చాలాచోట్ల రెబెల్స్ గా రంగంలోకి దిగారు. అయితే అంగబలం, అర్ధబలమున్నోళ్లు పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. కానీ కొందరు రాజీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్. నామినేషన్ ఉపసంహరించుకుంటే నాకేంటంటా? అని మెలికపెడుతున్నారట. దీంతో పార్టీ టికెట్లు పొందిన అభ్యర్థులు వారిని తమ దారిలోకి తెచ్చుకునేలా బేరసారాలకు దిగుతున్నారు. గంత కాదు గింత తీసుకో అంటూ ఎంతో కొంతకు సెట్ చేస్తున్నారట.

నామినేషన్ల ఉపసంహరణకు గురువారమే చివరిరోజు కావడంతో బుధవారం నాడు చాలాచోట్ల ఇలాంటి కార్యక్రమాలే నడిచాయని తెలుస్తోంది. ఆయా స్థానాలను బట్టి రెబెల్స్ బాగానే డిమాండ్ చేసినట్లు సమాచారం. 20-30 లక్షలకు సెట్ చేద్దామనుకున్న అభ్యర్థులకు కూడా రెబెల్స్ అడిగిన అమౌంట్ చూసి నోటి మాట రాలేదట. వారి మాటను కాదంటే ఓట్లు చీలుతాయనే భయం ఒకవైపు.. వారు అడిగినంత ఇచ్చుకోలేని పరిస్థితులు మరోవైపు ఇలా బరిలో నిలిచిన అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. టికెట్ వచ్చినందుకు సంతోషించాలో.. రెబెల్స్ ను సెట్ చేయలేక ఏడ్వాలో తెలియని పరిస్థితి కొందరిది.

 నాకంతుంది, ఇంతుంది.. పైసా తగ్గను

నాకంతుంది, ఇంతుంది.. పైసా తగ్గను

కొత్తగా పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నవారి పరిస్థితి మరీ ఘోరంగా ఉందట. వీరేమో కొత్త.. పార్టీలో పాతుకుపోయిన లీడర్ల సపోర్ట్ కావాల్సిందే. ఇదే అంశం కొందరికి వరంగా మారింది. దీంతో రెబెల్స్ గా నామినేషన్లు వేశారు. వీరు పోటీలో ఉంటే తమ గెలుపు కష్టమని భావిస్తున్న పార్టీ అభ్యర్థులు మధ్యవర్తుల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. రెబెల్స్ ను సెట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. అదలావుంటే రెబెల్స్ డిమాండ్స్ మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయట. నేను పార్టీకోసం, క్యాడర్ కోసం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టుకున్నాను. నాకు నియోజకవర్గంలో ఇంత బలముందంటూ ఏవో లెక్కలు చెప్పి అనుకున్నకాడికి పైసా తగ్గడం లేదని తెలుస్తోంది. దీంతో అభ్యర్థులకు ఏంచేయాలో తోచక, సమయం ఎక్కువగా లేక సరేనంటూ ఓకే చెబుతున్నారట.

సామాజికవర్గం.. అదే వరం

సామాజికవర్గం.. అదే వరం

కొన్నిచోట్ల రెబెల్స్ చక్రం తిప్పుతున్నారు. స్కెచ్చులేసి అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక పార్టీ అభ్యర్థికి రెబెల్ గా వేసినోళ్లు.. అపొజిషన్ అభ్యర్థులను అస్త్రంగా వాడుకుంటున్నారు. అపొజిషన్ అభ్యర్థి గంత ఇస్తానంటుండు.. మరీ మీ సంగతేంటని ప్రశ్నిస్తున్నారట. ఇక సామాజికవర్గాలను ఉపయోగించుకునే వసూల్ రాజాల ఐడియాలకు అంతే లేదు. రాజకీయ సమీకరణాలతో కొన్నిచోట్ల రెండు పార్టీలు ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలకు పార్టీ టికెట్లిచ్చాయి. అయితే అదే సామాజికవర్గానికి చెందిన రెబెల్స్ ఇలాంటి అవకాశాన్ని అనుకూలంగా మలచుకుంటున్నారట. అపొజిషన్ అభ్యర్థి అంతంటుండు.. మరీ మీరు గింతిస్తే పోటీ నుంచి తప్పుకుంటా, మీకు ప్రచారం చేస్తా లేదంటే మీ ఇష్టమంటూ బంతిని వాళ్ల కోర్టులోకే నెడుతున్నారని సమాచారం. దీంతో ఆ రెబెల్ అడిగినకాడికి సమర్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.

 బడానేతలతో రాజీ.. చిన్నోళ్లకే తిప్పలు

బడానేతలతో రాజీ.. చిన్నోళ్లకే తిప్పలు

సాధారణంగా రెబెల్స్ తిప్పలు బడా నేతలకు ఉండవు. ఎందుకంటే వారితో పెట్టుకుంటే భవిష్యత్తులో ఎదగలేమనే భయం కావొచ్చు. ఏదో ఒక చోట బడా నేతలకు వ్యతిరేకంగా రెబెల్స్ ఎదురుతిరిగినా.. వారిని ఏదోరకంగా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి. భవిష్యత్తులో అండగా ఉంటామనే హామీలు కావొచ్చు లేదంటే పదవులు ఇస్తామనే ఆశ చూపించడం కావొచ్చు. అయితే కింది స్థాయి నేతలకే ఈ రెబెల్స్ తిప్పలన్నీ. పోటీలో ఉంటామంటూ హైప్ క్రియేట్ చేసి, నామినేషన్లప్పుడు నానా హంగామా చేసి పార్టీ అభ్యర్థులకు ఒక సంకేతం పంపిస్తారు. వీడు పోటీలో ఉంటే నాకు గోస అనే రీతిలో ఉంటుందది. అందుకే పాపం రెబెల్స్ ఆడిందే ఆట పాడిందే పాటగా పైసా వసూల్ దుకాణాలు పనిచేస్తుంటాయి.

English summary
rebels demanding crores of money in telangana elections from party candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X