హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో నెలరోజుల్లో ఊహించని స్థాయిలో కరోనా: తెలంగాణలో 2.84 లక్షల నుంచి 9.66 లక్షలు..? అంచనా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విధ్వంసం సృష్టించబోతుంది. మరో నెల రోజుల్లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. కరోనా కేసులు మూడింతలు పెరిగే అవకాశం ఉందని ఏఎస్సీఐ-ఫిక్కీ అధ్యయనంలో తేలింది. ఈ విషయం ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు 75 వేలకు చేరిన సంగతి తెలిసిందే. అవీ మూడింతలు చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టంగా ఉంది.

 వైసీపీ నేత పీవీపీకి తెలంగాణ హైకోర్టులో ఊరట: అప్పటిదాకా ముందస్తు బెయిల్‌ గడువు పెంపు వైసీపీ నేత పీవీపీకి తెలంగాణ హైకోర్టులో ఊరట: అప్పటిదాకా ముందస్తు బెయిల్‌ గడువు పెంపు

 2.84 లక్షలకు కేసులు..

2.84 లక్షలకు కేసులు..

సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 2.84 లక్షల నుంచి 9.66 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ఏఎస్‌సీఐ-ఫిక్కీ అంచనా వేసింది. కేసులు పెరుగుతున్న తీరు ఆధారంగా కేసుల పెరుగుదలను ఊహించింది. రెండు విధాలుగా మ్యాథమెటికల్ ప్రొజెక్షన్స్ రూపొందించి.. లెక్కగట్టింది. ఇలాగే కేసులు పెరిగితే రాష్ట్రంలో కేసుల సంఖ్య 2.84 లక్షలకు చేరుతుందని తెలిపింది.దీంతోపాటు రోజుకు 18 మంది మరణిస్తారు.

 9.66 లక్షలు అని మరో అంచనా

9.66 లక్షలు అని మరో అంచనా

రాష్ట్రంలో 9.66 లక్షల మంది కరోనా బారిన పడతారని మరో అంచనా ప్రకారం వెల్లడించింది. రోజుకు 83 మంది ప్రాణాలు కోల్పోతారని వివరించింది. జూన్ 21 నుంచి జులై 24 వరకు డేటాను పరిశీలించి.. దాని ఆధారంగా పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశంపై అంచనాకు వచ్చామని ఏఎస్ఐసీ సెంటర్ ఫర్ హెల్త్ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డాక్టర్ సస్వత్ మిశ్రా తెలిపారు.

అంచనా ఇలా..

అంచనా ఇలా..

సెప్టెంబర్ చివరి నుంచి నవంబర్ వరకు దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా చేరుకుంటాయనే అంచనాల నేపథ్యంలో 30వ తేదీని ఎంచుకున్నామని తెలిపారు. ఇదీ కేవలం అంచనా మాత్రమే, నిజం కావొచ్చు, కాకపోవచ్చు అని తెలిపారు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల వరకు హెల్త్‌కేర్ మెకానిజాన్ని మెరుగుపర్చాలని సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుబోధ్ కందముథన్ తెలిపారు.

Recommended Video

Sushant Singh Rajput : రియా పై ఈడీ విచారణ.. సుశాంత్ డబ్బుతో భారీ భవంతులు ! || Oneindia Telugu
24 గంటల్లో 2 వేలకు పైగా కేసులు

24 గంటల్లో 2 వేలకు పైగా కేసులు

ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు రోజుకు 2 వేల వరకు వస్తున్నాయి. గత 24 గంటల్లో 2 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. 2 వేల 207 పాజిటివ్ కేసులతో మొత్తం కేసులు 75 వేలు దాటాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 75 వేల 257 కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1136 మందికి వైరస్ తగ్గింది. దీంతో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 53 వేల 239కి చేరింది. ప్రస్తుతం 21 వేల 417 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 12 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 601కి చేరింది. గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు 500 నుంచి 600 వరకు వస్తున్నాయి. నిన్న కూడా 532 కేసులు రాగా.. రంగారెడ్డి జిల్లాలో 196 కేసులు బయటపడ్డాయి.

English summary
coronavirus cases between 2.84 lakh and 9.66 lakh by september 30 asci ficci study revel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X