హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఇద్దరి మద్య ప్రేమాయణం ఉన్నట్టా.?లేనట్టా.?ఇంకెంతకాలం జనాల మీద రుద్దుతారు..!బోర్ కొట్టట్లా..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గత కొన్ని సంవత్సరాలుగా టీవి కార్యక్రమాల్లో ఓ జంట మీద విచిత్ర ప్రచారం చోటుచేసుకుంటోంది. ఆ ప్రచారం కొన్ని సందర్బాల్లో ఛానల్ రేటింగ్ పెంచుకునేందుకు కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతోంది. కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు కొన్ని టీవి వినోదపు కార్యక్రమాల్లో కనిపిస్తోంది. ఒకానొక సందర్బంలో సదరు వ్యక్తి ఆ యాంకరమ్మని ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు అందరి ప్రముఖులకు పెళ్లి ఆహ్వాన పత్రికలను కూడా పంచుతాడు. రెండు గంటలుగా టీవి షోలో నిమగ్నమైన ప్రేక్షకులను వెర్రి పూష్పాలను చేసి, అదంతా ఓ కలగా ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆ ఇద్దరి అపురూప జంట మద్య ఇలాంటి పసలేని షోలు ఎన్నో ఉన్నాయి.

వినోదం తక్కువ.. విసుగెక్కువ.. ఆ ఇద్దరి సంబంధానికి ఎందుకంత ప్రాధాన్యత..

వినోదం తక్కువ.. విసుగెక్కువ.. ఆ ఇద్దరి సంబంధానికి ఎందుకంత ప్రాధాన్యత..

ఇటీవల ఏ వినోదపు కార్యక్రమం చూసినా కమేడియన్ సుధీర్, యాంకర్ రేష్మీ గౌతమ్ ల మద్య ఉన్న సంబంధాన్ని ఓ ట్రాక్ లా నడిపిస్తూ కార్యక్రమాన్ని రూపొందింస్తున్నారు. అసలు కాస్పెప్ట్ వేరైనా వీరిద్దరిని ఆటలో అరటిపండులా చూపిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించే ప్రయాత్నం చేస్తున్నారు నిర్వాహకులు. అసలు వీరిద్దరి మద్య ఎలాంటి సంబంధం ఉందో ఎవరికి స్పష్టంగా తెలియక పోయినా ఏదో ఉందని హైప్ క్రియేట్ చేస్తూ రేటింగ్ పెంచుకుంటున్నాయి ఎంటర్ టెయిన్ మెంట్ కార్యక్రమాలు రూపొందించే ఛానళ్లు.

సంవత్సరాలుగా సాగదీత.. వేరే కాన్సెప్టులు లేవా.?

సంవత్సరాలుగా సాగదీత.. వేరే కాన్సెప్టులు లేవా.?

ఇదిలా ఉండగా ఎంటర్ టెయిన్ మెంట్ షోలలో రేష్మీ గౌతమ్ పేరు ఎత్తగానే ఆ పేరుకు పేటెంట్ హక్కులు తనకే ఉన్నట్టు ఓ పోస్ ఇస్తాడు సుధీర్. అంతే కాకుండా సుధీర్ పేరు ఎత్తగానే కృత్రిమ సిగ్గును వలకబోస్తూ ఆస్కార్ రేంజ్ లో నటించేస్తుంటుంది రేష్మీ. కళ్లను రకరకాలుగా ఆర్పుతూ ఒచ్చి రాని తెలుగులో ఏదో భావాన్ని వ్యక్తం చేస్తుంటుంది. ఇక రేష్మీ అలా మాట్లాడగానే నటన రాకున్నా ఫిల్మ్ ఫేర్ బెస్టు యాక్టర్ లా రెచ్చిపోతాడు సుధీర్. ఒక్కోసారి జాలిగా చూస్తూ నువ్వే నా సర్వస్వం అనే ఫీలింగ్ రసవత్తరంగా పండిస్తాడు. ఇక వీరి మద్యలో ఉన్న యాంకర్ కామెంట్రీ చెప్పి చెప్పి జీవితం మీద విరక్తి కలిగిస్తుంటాడు.

కార్యక్రమాల నిర్వహకులు బోర్ కొట్టించే దాకా వదలరా.. ఇక ఆపండి అంటున్న ప్రేక్షకులు..

కార్యక్రమాల నిర్వహకులు బోర్ కొట్టించే దాకా వదలరా.. ఇక ఆపండి అంటున్న ప్రేక్షకులు..

ఈ ఇద్దరికి ఇంత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న టీవి షో నిర్వాహకులు ఓ విషయం మర్చిపోతున్నట్టు తెలుస్తోంది. దేనికైనా ఎక్స్ పైరీ డేట్ ఉన్నట్టే కొన్ని టీవి కార్యక్రమాలకు కూడా ఉంటుంది. ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న యాంకర్ లు కూడా జనాలకు బోర్ కొట్టేస్తారు. ఒకప్పుడు దూర్ దర్శన్ లో వచ్చే వార్తల అంశంలో ఇంకెంత కాలం చదువుతావు బాబు వార్తలు అనే అభిప్రాయం ప్రేక్షకుల నుండి వ్యక్తం అయ్యింది. అంటే ప్రేక్షకుడు అనే వాడు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతాడనే అంశం స్పస్టంగా నిర్దారణ అవుతోంది.

ఏమీ లేనప్పుడు ఎందుకు హైరానా.? విసుగుపుట్టిస్తున్న జంట..

ఏమీ లేనప్పుడు ఎందుకు హైరానా.? విసుగుపుట్టిస్తున్న జంట..

సినిమా థియేటర్ల నుండి టీవీలు, టీవిల నుండి స్మార్ట్ ఫోన్లకు షిఫ్ట్ అయిపోయిన వినోదం అనే కార్యక్రమం ఎప్పుడూ మూస విధానంలో ఉంటే పిచ్చ బోర్ కొడుతుంది. ప్రస్తుతం రేష్మీ, సుధీర్ ల అంశంలో ఇదే జరుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా వాలుచూపులతో రేష్మీ సిగ్గుపడటం, కళ్ల మీద పడ్డ జుట్టు మద్యలోంచి ఆద్రతగా సుధీర్ చూసే చూపులు సగటు ప్రేక్షకులకు వినోదం కన్నా చికాకునే ఎక్కువగా కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణలో సుధీర్, రేష్మీ ల మద్య ఉన్న రిలేషన్ కి ప్రాధాన్యత తగ్గిస్తే కార్యక్రమం కాస్త చూసే వెసులుబాటు ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

English summary
Opinions are also being expressed that if the relationship between Sudhir and Reshmi is reduced in the management of special programs, it will be easier to watch the program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X