• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పీసిసి ఛీఫ్ గా రేవంత్ రెడ్డి..? టీ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులకు శ్రీకారం చుడుతున్న హైకమాండ్..!!

|
  రేవంత్ రెడ్డికి TPCC బాధ్యతలు అప్పగించే యోచనలో ఏఐసీసీ || Oneindia Telugu

  హైదరాబాద్‌ : క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల పీసీసీలను మార్చాలని కూడా ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదవీకాలం ముగిసినా, వరుస ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ ఆయననే కొనసాగించింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి రాజకీయ హడావిడి లేనందున పీసీసీ మార్పు కోసం కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అందుకోసం అందరిని కలుపుకుపోయి, ప్రజాకర్షణ కలిగిన నేత కోసం కాంగ్రెస్ అదిష్టానం దృష్టి పెట్టినట్టు సమాచారం. మారుతున్న కాలం ప్రకారం యూత్ ని ఎక్కువ ఆకర్షించే నేత ఐతే తెలంగాణలో ప్రభావం చూపించగలరనే నమ్మకాన్ని కాంగ్రెస్ అదిష్టానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

  తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులు..! పీసిసి ఛీఫ్ ని మార్చబోతున్న అదిష్టానం..!!

  తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులు..! పీసిసి ఛీఫ్ ని మార్చబోతున్న అదిష్టానం..!!

  తెలంగాణ పీసిసిలో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఐక్యతా రాగం తీసుకొచ్చి, ప్రజాధరణ పొందేలా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ ముందుకు నడిపే నేత కోసం కాంగ్రెస్ అదిష్టానం అన్వేషణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా యువతతో పాటు విద్యార్ధి లోకాన్ని పెద్ద యెత్తున ఆకర్శించగల నేత కోసం వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి గెలుపొందిన రేవంత్ రెడ్డి కి తెలంగాణ పగ్గాలు అప్పజెప్పే దిశగా అదిష్టానం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

  సమీకరణాలు సమీక్షిస్తున్న ఏఐసిసి..! సరైన నేతకోసం అన్వేషణ..!!

  సమీకరణాలు సమీక్షిస్తున్న ఏఐసిసి..! సరైన నేతకోసం అన్వేషణ..!!

  తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపడితే పార్టీలో అంతర్గత యుద్దం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. పార్టీని నమ్ముకొని సుధీర్గ కాలం పని చేసిన నేతల నుండి రేవంత్ రెడ్డికి ప్రతిఘటన ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. అటువంటి నేతలందరితో రేవంత్ రెడ్డి మంతనాలు జరిపి వారిని ఒప్పించాల్సిన అవసరం ఉంటుంది. జానారెడ్డి, వి.హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి వంటి నేతలను రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డికి యువతలో మంచి క్రేజ్ ఉండడంతో యువనేతలతో ఆయనకు పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాక పోవచ్చనే చర్చ కూడా నడుస్తోంది.

  రేవంత్ రెడ్డి వైపు అదిష్టానం చూపు..! దూసుకుపోయే తత్వమే కలిసొచ్చిందా..?

  రేవంత్ రెడ్డి వైపు అదిష్టానం చూపు..! దూసుకుపోయే తత్వమే కలిసొచ్చిందా..?

  తెలంగాణలో అధికార గులాబీ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కునే సత్తా ఉంది కేవలం రేవంత్ రెడ్డి కి అని నిర్ణయించుకున్న అధిష్టానం ఆ పదవిని రేవంత్ రెడ్డికి అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే 2015 నుండి తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నప్పటికి పార్టీని అదికారంలోకి తేలేకపోయాడని, ఎమ్మెల్యేలను కాపాడలేక పోయాడనే అపవాదు ఉంది. ఐతే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమకుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే సత్తా కేవలం రేవంత్ రెడ్డి కి ఉండటమే కాకుండా యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో రేవంత్ రెడ్డి కి ఈ బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం.

  పీసిసి హోదాలో రేవంత్ పాదయాత్ర..! హైకమాండ్ ప్రకటన తర్వాత కార్యాచరణ..!!

  పీసిసి హోదాలో రేవంత్ పాదయాత్ర..! హైకమాండ్ ప్రకటన తర్వాత కార్యాచరణ..!!

  ఇక రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావును సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా, ప్రజాకర్షక నేతగా నిరూపించు కోవడం కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. నిత్యం జనాల్లో ఉండి సమస్యలను తెలుసుకోవాలంటే పాదయాత్ర అత్యద్బతంగా ఉపకరిస్తుందిని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే ఆలోచనను అధిష్ఠానం ముందు రేవంత్‌రెడ్డి ఉంచినట్లు సమాచారం. అదిష్టానం ఆమోదం తెలిపితే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందకు రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే యాత్రను పిసిసి అద్యక్షుడి హోదాలో నిర్వహిస్తే పార్టీ మరింత లోతుగా ప్రజల్లో వెళ్తుందనేది రేవంత్ రెడ్డి ప్రణాళిగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కి పీసిసి పగ్గాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ అదికారంలోకి రావడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  As there is no political rush in Telangana at present, the PCC seems to have begun to change. For that purpose,the Congress high command is looking for an all-inclusive, charismatic leader. The Congress seems to have expressed its belief that a leader who is attracted to youth in a changing period could make an impact in Telangana.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more