హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరేళ్లుగా ప్రజలను మోసం చేయడం లేదని యాదాద్రి కొండమీద ప్రమాణం చేస్తరా?కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్బంగా గులాబీ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం చంద్రశేఖర్ రావు పరిపాలనపై మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తూనే ఉన్నడని, కాదంటే యాదాద్రి నర్సింహాస్వామి కొండమీదకు వచ్చి చంద్రశేఖర్ రావు ప్రామాణం చేయగలడా అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమాయకులపై కేసులు నమోదయ్యాయని, ఆ కేసులు మాఫీ చేయకపోగా చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యుల మీద ఉన్న రైల్వే కేసులను మాత్రం ప్రత్యేక అధికారిని నియమించుకుని మరీ మాఫీ చేయించుకున్నారని ఘాటుగా విమర్శించారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్..జగన్..ఓ ఎంపీ..!పోతిరెడ్డిపాడు పేరుతో డ్రామా రక్తి కట్టిస్తున్నారన్న రేవంత్ రెడ్డి..!!కేసీఆర్..జగన్..ఓ ఎంపీ..!పోతిరెడ్డిపాడు పేరుతో డ్రామా రక్తి కట్టిస్తున్నారన్న రేవంత్ రెడ్డి..!!

ఆరేళ్లుగా అప్పులు పెంచారు తప్ప ఏంచేసారు.. కేసీఆర్ ను నిలదీసిన రేవంత్ రెడ్డి..

ఆరేళ్లుగా అప్పులు పెంచారు తప్ప ఏంచేసారు.. కేసీఆర్ ను నిలదీసిన రేవంత్ రెడ్డి..

అంతే కాకుండా 12వందల మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో అమరవీరులకు సంబంధించిన చిరుణామాలు తెలియదని చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చెప్పడం దారుణాతి దారుణమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావు చెప్పే మాట‌ల‌కు, చేసే ప‌నుల‌కు ఎంతో వ్య‌త్యాసం ఉంద‌ని రేవంత్ ఆరోపించారు. ప్ర‌జ‌లు చంద్రశేఖర్ రావు మాట‌ల విధానాన్ని, చేత‌ల‌లోని నిలకడలేని తననాన్ని సునిశితంగా ప‌రిశీలించాల‌ని స్పష్టం చేసారు. దేశంలో ఏ రాష్ట్రం చేయ‌ని విధంగా 3ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అప్పులు చేశార‌ని, ధనిక రాష్ట్రం అంటే ఇదేనా అని రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు.

జగన్ తో కేసీఆర్ కుమ్ముక్కయ్యారు.. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయడం లేదన్న రేవంత్..

జగన్ తో కేసీఆర్ కుమ్ముక్కయ్యారు.. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయడం లేదన్న రేవంత్..

తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తు స్థాయికి తీసుకెళ్లిన నిఖార్సయిన ఉద్యమకారుల్లో ప్రొఫెసర్ జయశంకర్ సర్ తో పాటు ప్రొఫెసర్ కోదండరాం ప్రముఖ పాత్ర పోషించారని రేవంత్ తెలిపిరు. అంతే కాకుండా విద్యార్థులు, కళాకారులు, ఆర్టీసీ ఉద్యోగులు, సింగరేణి, రెవెన్యూ ఉద్యోగులను రేవంత్ రెడ్డి గుర్తు చేసారు. ప్రాజెక్టులలోని నీళ్లను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తోడుకెళ్తుంటే ఉదాసీనంగా వ్యవహరిస్తూ, ప్రశ్నిస్తున్న వారిని దూషించే వరకూ పరిస్థితి చేరిందంటే తెలంగాణ సిద్దించింది ఇందుకేనా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించలేక పోవడం అత్యంత దారుణమైన అంశంమని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మానిఫెస్టో తో పాటు ఏఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.. టీఆర్ఎస్, ఉద్యమ కారులకు అన్యాయం చేసిందన్న రేవంత్..

మానిఫెస్టో తో పాటు ఏఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.. టీఆర్ఎస్, ఉద్యమ కారులకు అన్యాయం చేసిందన్న రేవంత్..

అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు పూర్తి అయినా అంబేద్కర్ విగ్రహ స్థాసన ఏమైందని, కనీసం పునాది రాయి కూడా వేయలేదని గులబీ పార్టీపై మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించినప్పటికి మొహమాటం లేకుండా కూతురు కవితతో పాటు కుటుంబ సభ్యులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టలేదా అని మండిపడ్డారు. కేజీ టు పీజీ ఉచిత విద్యా అంటే సొంత పార్టీ నేతలకు యూనివర్సిటీలు కట్టబెట్టడమా అని ప్రశ్నించడంతో పాటు, ఉద్యమంలో చెప్పిన నీళ్లు-నిధులు-నియామకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 20 ఏళ్ల కింద పదవీ విరమణ చేసిన తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు చంద్రశేఖర్ రావు కీలక పదవులు కట్టబెడుతున్నారని, త్వరలోనే పదవులు పొందిన సీఎం బంధువుల చిట్టా బహిర్గతం చేస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Recommended Video

AP CM Jagan To Hold Cabinet Meetings Here After In Vizag
మంత్రి జగదీష్ సహనం కోల్పోయారు.. చెప్పుకోవడానికి ఏదీ లేకనే అలా ప్రవర్తించారన్న రేవంత్ రెడ్డి..

మంత్రి జగదీష్ సహనం కోల్పోయారు.. చెప్పుకోవడానికి ఏదీ లేకనే అలా ప్రవర్తించారన్న రేవంత్ రెడ్డి..

ఇదిలా ఉండగా ఆదివారం రోజుల నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన స్థాయిని మర్చి బజారు రౌడీలా వ్యవహరించారరేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డికి అభివృద్ది గురించి చెప్పుకోవడానికి ఏమిలేకపోవడంతోనే తెలంగాణ కాంగ్రెస్ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీస జ్ఞానం లేకుండా పై విమర్శలు చేసారని ధ్వజమెత్తారు. జగదీష్ రెడ్డి వీధిపోరాటానికి రావాలనుకుంటే ఏదైనా మైదానంలో వస్తే అక్కడకి కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారని అందుకు సిద్దంగా ఉంగాలని హెచ్చరించారు. జగదీష్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలని, మాట మర్యాద లేకుండా ప్రవర్తిస్తే తగుగుణ పాఠం తప్పదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా జగదీష్ రెడ్డికి సారాలో సోడా కలపడం తప్ప ఏమీ తెలియదని, ఆయనకు మంత్రి పదవి ఏ విధంగా వచ్చిందో కూడా అందరికి తెలుసన్నారు రేవంత్ రెడ్డి.

English summary
Six years of the Telangana state, the welfare schemes implemented by the trs party, Malkajigiri Congress MP Revant Reddy has fired on CM Chandrashekhar Rao administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X