హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ లో సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు .. కేసీఆర్ పై ఫైర్ అయిన ఉత్తమ్, రేవంత్

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గులాబీ బాస్ కెసిఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీల నేతలను కొనుగోలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు .

Recommended Video

Telangana Congress Party Targeted KCR And Slams About TRS Resort Camps

 ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ ... లైట్ తీసుకోవద్దంటూ గులాబీబాస్ క్లాస్ .. రీజన్ ఇదే !! ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ ... లైట్ తీసుకోవద్దంటూ గులాబీబాస్ క్లాస్ .. రీజన్ ఇదే !!

కేసీఆర్ వల్లే ప్రజాస్వామ్యం ఖూనీ ... ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్ వల్లే ప్రజాస్వామ్యం ఖూనీ ... ఉత్తమ్ కుమార్ రెడ్డి


తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయని అనుకున్నాం కానీ సీఎం కేసీఆర్ బరితెగించి వ్యవహరించడంతో ప్రజలకు సంతోషం లేకుండా పోయిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ వంటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నేతను తన అనుభవంలో చూడలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు ప్రజల తీర్పుతో ఓటమిపాలైన కవితను, ఎమ్మెల్సీగా రంగంలోకి దించారని క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు .

సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు అని ఫైర్ అయిన ఉత్తమ్

సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు అని ఫైర్ అయిన ఉత్తమ్


సంతలో పశువులను కొన్నట్టు ఎంపీటీసీలను కొంటున్నారని విమర్శలు గుప్పించారు. కవితను డిస్ క్వాలిఫై చేయవలసిందిగా ఎన్నికల సంఘాన్ని కోరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశాలు పెట్టకూడదని ఆక్షేపిస్తూ , టిఆర్ఎస్ పార్టీ మాత్రం క్యాంపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాజకీయాలను కెసిఆర్ కమర్షియల్ గా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీల వారీగా జాబితా ప్రకటించి మరీ కొంటున్నారు అంటూ ఫైర్ అయ్యారు.

ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్న డబ్బెక్కడిది? అని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి .

నిజామాబాద్ రిసార్ట్ లో టీఆర్ఎస్ క్యాంపులు .. రేవంత్ రెడ్డి

నిజామాబాద్ రిసార్ట్ లో టీఆర్ఎస్ క్యాంపులు .. రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ చెప్పిన సిద్ధాంతానికి కట్టుబడి లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ నాడు సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు కేవలం మాటలకే పరిమితం అంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్లో రిసార్ట్ క్యాంపులు నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.

తెలంగాణా అని చెప్పుకోలేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని రేవంత్ విమర్శలు

తెలంగాణా అని చెప్పుకోలేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని రేవంత్ విమర్శలు

టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రిసార్ట్ లో క్యాంపులు నిర్వహిస్తుందని , రాష్ట్ర ఎన్నికల సంఘం నిజామాబాద్ లో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్న రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ తీరు వల్ల మాది తెలంగాణ అని చెప్పుకోలేక పోతున్నాం అంటూ పేర్కొన్నారు.


ఒకప్పుడు తెలంగాణా ఉద్యమ సమయంలో మాది తెలంగాణా అని ధైర్యంగా , గొప్పగా చెప్పుకున్నామని కానీ ఇప్పుడు తెలంగాణా అని చెప్పుకునే పరిస్థితి లేకుండా సీఎం కేసీఆర్ చేశారని విమర్శించారు .

English summary
Congress party leaders are incensed that the TRS party is doing camp politics during the local body MLC elections in Nizamabad. TPCC President Uttam Kumar Reddy and Working President Revanth Reddy have been targeting KCR. In Nizamabad, the TRS party has been criticized for buying opposition party leaders despite having a majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X