హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖబడ్దార్ కేసీఆర్, నాని: తెలంగాణ గురించి మాట్లాడితే ఊరుకునేదీ లేదు: రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టాలని కోరుతున్నారని చెప్పిన సంగతి తెలిసిందే. తర్వాత ఏపీ మంత్రులు/ నేతలు కౌంటర్ ఇచ్చారు. మంత్రి అనిల్ కుమార్ తర్వాత పేర్ని నాని మాట్లాడారు. ఏపీని తెలంగాణలో కలిపి ఎన్నికలు నిర్వహించాలని పేర్ని నాని అన్నారు. దీనిపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

సీఎం కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని కామెంట్ చేశారు. వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌ అని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

Revanth angry on cm kcr, perni nani

ఏపీలోనూ తమ పాలన కోరుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించగా, ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ... సీఎం కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని, అయితే రెండు రాష్ట్రాలను కలిపేసేలా ఆయన ఓ తీర్మానం చేస్తే బాగుంటుందని అన్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.ఈ మేరకు రేవంత్ ట్వీట్ చేశారు. కేసీఆర్, పేర్ని నానిల కామెంట్లను కూడా వీడియో రూపంలో పంచుకున్నారు.

Recommended Video

సిద్దిపేట కలెర్టర్ పై మండిపడ్డ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ || Oneindia Telugu

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే స్వయం పాలన కోసం.. నీళ్లు నిధులు నియామకాల కోసం.. 50 ఏళ్లకు పైగా కలిసి ఉండి.. డెవపల్ చెందడం లేదని భావన వచ్చింది. దీంతో ఉద్యమించి స్వ రాష్ట్రం సాధించుకున్న సంగతి తెలిసిందే. నేతల కామెంట్లతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

English summary
tpcc chief Revanth reddy angry on cm kcr, ap minister perni nani. they comment about elections and telangana ap reunion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X