• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ముగ్గురికి సవాల్‌గా మారిన ముట్టడి..దడ పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి దూకుడు!

|

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి.. ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బ్రాండ్ ఉంది. యువతలో మంచి క్రేజ్ ఉంది. విద్యార్ధిలోకంలో మంచి కిక్ ఉంది. రాజకీయ ప్రత్యర్థి వర్గాల్లో మాత్రం కలవరం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాల పట్ల రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసి కార్మికుల సమ్మె, హుజూర్ నగర్ ఉప ఎన్నిక అంశంలో రేవంత్ రెడ్డి ట్రంప్ కార్డ్ గా మారిపోయారు. ఇక ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంతో ప్రభుత్వ వర్గాలకు, పోలీసులతో పాటు సొంత పార్టీలోని సీనియర్ నేతలకు చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి.

  Revanth Reddy : SI ఫిర్యాదుతో రేవంత్ పై నాన్ బెయిలబుల్ కేసు || Oneindia Telugu

  మూడు వేల మంది పోలీసులు.. మూడంచెల భద్రత.. ఐనా ప్రగతి భవన్ గడీని ఢీ కొట్టిన రేవంత్ రెడ్డి..!!మూడు వేల మంది పోలీసులు.. మూడంచెల భద్రత.. ఐనా ప్రగతి భవన్ గడీని ఢీ కొట్టిన రేవంత్ రెడ్డి..!!

  ఒక ముట్టడి..! మూడు వర్గాల్లో కలవరం నింపిన రేవంత్ రెడ్డి..!!

  ఒక ముట్టడి..! మూడు వర్గాల్లో కలవరం నింపిన రేవంత్ రెడ్డి..!!

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో సొంత పార్టీలోని సీనియర్లు కూడా అంతే సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీసి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతలందరూ ప్రగతిభవన్ ను ముట్టడిస్తే కార్మికుల సమ్మె ఎంత బలంగా ఉందో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు తెలిసొస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. అందులో భాగంగా అందుబాటులో ఉన్న నాయకులందరూ ప్రగతి భవన్ ముట్టడించేందకు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఐతే పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎవ్వరిని ప్రగతి భవన్ వైపు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. ఐతే అసలు కథ ఇక్కడే మొదలైంది.

  పోలీసులకు అర్ధం కాని రేవంత్ వ్యూహం..! సిటీ పోలీసులపై సీఎం ఆగ్రహం..!!

  పోలీసులకు అర్ధం కాని రేవంత్ వ్యూహం..! సిటీ పోలీసులపై సీఎం ఆగ్రహం..!!

  కాంగ్రెస్ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, జగ్గారెడ్డి తో పాటు రేవంత్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేసేందుకు ఉదయం ఆరు గంటలకే రంగంలోకి దిగారు పోలీసులు. ఐతే పోలీసులకు ప్రగతి భవన్ ముట్టడిని అడ్డుకోవడం ఒక ఎత్తైతే, రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడం ఒక ఎత్తైంది. ఇంట్లో లేని రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని నగరాన్ని జల్లెడ పట్టారు పోలీసులు. ఐనప్పటికి రేవంత్ రెడ్డి ఆచూకీ తెలుసుకోలేక పోయారు. చివరకు పదకొండు గంటలకు ఇంట్లోనుండి బుల్లెట్ లా దూసుకొచ్చి బుల్లెట్ మీద ప్రగతి భవన్ ముట్టడికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. అక్కడే ఉన్న మీడియా రేవంత్ రెడ్డి కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు ఉలిక్కి పడినంత పనయ్యింది.

  రేవంత్ రెడ్డి దూకుడు..! ఖంగు తిన్న పోలీసులు..!!

  రేవంత్ రెడ్డి దూకుడు..! ఖంగు తిన్న పోలీసులు..!!

  ఐతే మూడు వేల మంది పోలీసులు పహారా కాస్తున్నా, మూడంచెల భద్రత ఉన్నా పోలీసుల కళ్లు గప్పి నగరం నడిబొడ్డులోంచి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న రేవంత్ రెడ్డి సాహసం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో మాత్రం ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంతో రేవంత్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించారా అనే అంశాలు పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకునే దిశాగా ఉపక్రమించాలని పోలీసులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసి కార్మికుల సమ్మెతో ఏం చేయాలో పాలు పోని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పంటికింద రాయిలా పరిణమించినట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ని కట్టడి చేయాలని ప్రభుత్వ వర్గాలు సీరియస్ గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ప్రశంసించాల్సింది పోయి విమర్శలకు దిగుతున్నారట కాంగ్రెస్ సీనియర్ నేతలు.

  ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..! బుల్లెట్ దిగిందా.. లేదా అంటున్న రేవంత్ రెడ్డి..!!

  ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..! బుల్లెట్ దిగిందా.. లేదా అంటున్న రేవంత్ రెడ్డి..!!

  కాంగ్రెస్ లో అతనొక్కడే రేంజ్ లో ముందుండి పార్టీకి జవసత్తువలు నింపుతున్న రేవంత్ రెడ్డి వ్యవహారం కొంత మంది సీనియర్ నేతలకు కంటిలో నలుసులా మారింది. పార్టీకి ఎప్పటినుండో విధేయులుగా ఉంటున్నాం, పార్టీ కష్ట కాలంలో అండగా ఉన్నాం.. ఇప్పుడొచ్చిన వాళ్ల పెత్తనం ఏంటనే ధోరణిలో సీనియన్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కాని రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా.. లేదా.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటినుంచో పార్టీకి విధేయులుగా ఉంటే పార్టీని ఎందుకు గెలుపించలేక పోయారనేది రేవంత్ రెడ్డి వర్గీయుల ప్రశ్న. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి పట్లాలెక్కించి పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి సిద్దంగా ఉన్నప్పుడు సహకరించాలనేది రేవంత్ రెడ్డి అనుచరుల వాదన. మొత్తానికి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంతో అటు ప్రభుత్వ వర్గాలకు, పోలీసులకు, కాంగ్రెస్ సీనియర్లకు కంటిలో నలుసులా పరిణమించారు రేవంత్ రెడ్డి అనే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.

  English summary
  Revanth Reddy became the trump card in the area of the RTC workers strike and Huzur nagar by-election. Revanth Reddy has shown spotting the senior leaders of the home party along with the government groups and police with the Pragati Bhavan siege program.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X