హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్క అల్లుడికే భయపడ్డావు! అలా చేస్తే సమ్మె ఉండేది కాదు కదా?: కేసీఆర్‌కు రేవంత్ సూటి ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు 35 రోజుల ముందు సమ్మె నోటీసు ఇచ్చి.. సమ్మె చేస్తుంటే.. దసరా పండగ ముందు సమ్మె చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతారా? అంటూ సీఎం కేసీఆర్ అనడం ఏంటని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటి వరకు వేచి చూడకుండా మీరు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఉండవచ్చు కదా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

రాష్ట్రం 'మెఘా’వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్రాష్ట్రం 'మెఘా’వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్

కార్మికులు సహకరించేవారు కాదా?

కార్మికులు సహకరించేవారు కాదా?

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి.. సమ్మెను దసరా తర్వాతకు వాయిదా వేసుకోవాలని కోరివుంటే వారు కూడా సహకరించేవారు కాదా? అని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుడు ఆర్టీసీ సంఘాలు అంగీకరించకుంటే.. తాము సైతం ఆర్టీసీ సంఘాలను ఒప్పించే ప్రయత్నం చేసేవారమని అన్నారు.

కొడుక్కి, అల్లుడికి ఉద్యోగాలిచ్చి.. 50వేల మందిని రోడ్డుకీడుస్తావా?

కొడుక్కి, అల్లుడికి ఉద్యోగాలిచ్చి.. 50వేల మందిని రోడ్డుకీడుస్తావా?

ఆర్టీసీ ఉద్యోగులంటే.. మీ ఫాంహౌస్ కార్మికులు కాదని కేసీఆర్‌నుద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. నీ కొడుకు, అల్లుడికి ఆరు నెలల్లోపే తిరిగి ఉద్యోగాలిచ్చావు.. ఇప్పుడు 50వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డుకీడుస్తావా? అంటూ నిలదీశారు. ప్రజలను ఇబ్బందులు పెట్టాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం లేదని, తమ న్యాయమైన డిమాండ్లు మాత్రమే నెరవేర్చాలంటున్నారని చెప్పారు. అంతేగాక, ఆర్టీసీ కార్మిక సంఘాలు మెరుపు సమ్మెకు కూడా ఏమీ దిగలేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయం.. కోర్టులున్నాయ్

కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయం.. కోర్టులున్నాయ్


కేసీఆర్ వైఫల్యం, ధన దాహం వల్లే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని రేవంత్ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకు వస్తుందని చెప్పారు. మీరు పోరాటం చేయండి.. మీ ఉద్యోగాలను ఎవరూ తొలగించలేరు అని కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. అంతేగాక, కోర్టులు కూడా ఉన్నాయని చెప్పారు. మూడు నెలలకో.. మరి కొంత సమాయానికో కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు. కార్మికులతో గొక్కోవద్దని గతంలో కేసీఆర్ అన్నారని.. ఇప్పుడు కేసీఆరే కార్మికులతో పెట్టుకుని తన కొంపను తానే కూల్చుకుంటున్నారని అన్నారు.

ఆ సంస్థతో కలిసి కేసీఆర్ కుట్రలు

ఆ సంస్థతో కలిసి కేసీఆర్ కుట్రలు

కేసీఆర్ ఒక సంస్థతో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు కదా.. ఆ సంస్థ పేరెంటి అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాను ఆ సంస్థ పేరు స్పష్టంగా చెప్పానని మీరే అర్థం చేసుకోలేదని చమత్కరించారు. 4వేల ప్రైవేటు బస్సుల కొనుగోళ్లలో గోల్ మాల్ జరుగుతోందని వ్యాఖ్యానించారు.
ఆర్టీసీన ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఆర్టీసీని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని, ఆ ఆదాయం జీహెచ్ఎంసీకే చెందుతుందని కూడా కేసీఆర్ అన్నారని చెప్పారు.

చర్చలు ఎందుకు జరపరు?

చర్చలు ఎందుకు జరపరు?

ఆర్టీసీని వినియోగించుకుంటున్న పేద ప్రజలపై కేసీఆర్ సర్కారు ఎందుకు భారం మోపుతోందని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు నెరవేర్చమంటున్నారని చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చలు ఎందుకు చర్చలు జరపడం లేదని, ఆ బాధ్యత మీపై లేదా? అని సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి నిలదీశారు. అశ్వద్ధామ రెడ్డిని గతంలో యోధుడని.. ఇప్పుడేమో విమర్శిస్తావా? అంటూ ప్రశ్నించారు.

అల్లుడు బొక్క పెడతాడని..

అల్లుడు బొక్క పెడతాడని..

పెట్టుబడి సంస్థలు, కేసీఆర్ కుటుంబానికి మేలు చేసే విధంగా సర్కారు నిర్ణయాలున్నాయని మండిపడ్డారు. ఒక్క కలంపోటుతో 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ఎలా తొలగిస్తారని రేవంత్ ప్రశ్నించారు. ఆరు నెలలు పక్కనపెడితేనే అల్లుడు బొక్క పెడతాడని వెంటనే ఉద్యోగం ఇచ్చినవు.. 50వేల మంది కార్మికులు ఏం చేస్తారో తెలియదా? అని నిలదీశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా తాము ఉన్నామని చెప్పారు. కేసీఆర్ ధన దాహాన్ని, కుట్రలను ప్రజలకు ఆర్టీసీ కార్మికులే తెలియజేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

English summary
Congress MP Revanth Reddy fires at KCR government on tsrtc strike issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X